Devara Special Show | జూనియర్ ఎన్టీఆర్ కథానాయకుడిగా నటించిన దేవర చిత్రం నేటికి ఏడాది పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఎన్టీఆర్ చిత్రబృందానికి వార్షికోత్సవం శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మరోవైపు చిత్రబృందం కూడా దేవర వన్ ఇయర్ పూర్తి చేసుకున్న సందర్భంగా దేవర 2 త్వరలోనే సెట్స్ మీదకి వెళ్లబోతున్నట్లు ప్రకటించింది. అయితే ఈ సినిమా ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా అభిమానుల కోసం చిత్రబృందం స్పెషల్ షోని ఏర్పాటు చేసింది. కూకట్పల్లిలోని అర్జున్ థియేటర్లో రాత్రి 9 గంటలకు దేవర సినిమాను ప్రదర్శించబోతున్నట్లు ప్రకటించింది. ఈ సందర్భంగా పోస్టర్ను పంచుకుంది.
ఈ సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహించగా.. జాన్వీ కపూర్ కథానాయికగా నటించింది. సైఫ్ అలీఖాన్ విలన్గా నటించాడు. ఈ చిత్రం సెప్టెంబర్ 27న విడుదలై దాదాపు రూ.500 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది.
A heartfelt thanks to @vishwaprasadtg garu 🙏 for graciously allotting the 27th September 2nd show at Arjun 70MM for the #Devara Anniversary Special Show.
On behalf of all NTR fans ❤️🔥, we extend our gratitude to him along with Teja Sajja garu and Karthik Ghattamneni garu for… pic.twitter.com/xcMXBWkwMp
— Vamsi Kaka (@vamsikaka) September 27, 2025