K Ramp | యువ నటుడు కిరణ్ అబ్బవరం ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం కే రాంప్ (K Ramp). హాస్య మూవీస్ బ్యానర్లో వస్తున్న ఈ సినిమాను రాజేశ్ దండా నిర్మిస్తుండగా.. జైన్స్ నాని దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. మలయాళ బ్యూటీ ‘యుక్తి తరేజా’ ఈ సినిమాలో కథానాయికగా నటిస్తుంది. లవ్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్గా వస్తున్న ఈ సినిమాకి చైతన్య భరద్వాజ్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రం దీపావళి కానుకగా అక్టోబర్ 17న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా ప్రమోషన్స్‌లో పాల్గోంటుంది చిత్రయూనిట్. అయితే ఈ సినిమా టైటిల్ విషయంలో ఇన్నిరోజులు వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా టైటిల్ ‘కె-ర్యాంప్’( K Ramp) బూతు పదంలా ఉందని ఆరోపణలు వస్తున్నాయి. అయితే తాజాగా ఈ విషయంపై క్లారిటీనిచ్చాడు దర్శకుడు జైన్స్ నాని.
‘కె-ర్యాంప్’( K Ramp) అంటే బూతు పదం కాదని.. దాని అర్థం కిరణ్ అబ్బవరం ర్యాంప్ అని తెలిపాడు. కిరణ్‌ను దృష్టిలో పెట్టుకొనే ఈ స్క్రిప్ట్ రాశానని తెలిపాడు. కిరణ్ కెరీర్లో ఈ చిత్రం సూపర్ హిట్‌గా నిలిచిపోతుందని నాని అన్నారు. మరోవైపు ఈ సినిమాపై కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ.. థియేటర్లో కూర్చుని నవ్వుకునే వైబ్ ఉన్న సినిమా ఇది. ఈ మూవీ హిట్ అవుతుందా లేదా అనేది పక్కన పెడితే నాకు దర్శకుడు నాని రూపంలో మంచి బ్రదర్ దొరికాడు. లైఫ్‌లో నానిని ఎప్పుడు చూసిన నవ్వుతునే ఉంటాను. ఆడియన్స్ కూడా ఈ సినిమా చూశాకా అలానే నవ్వుతూ ఉంటారని తెలిపాడు.