Devara Movie Part 2 announcement | యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నటించిన మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ దేవర. ఈ సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహించగా.. గతేడాది సెప్టెంబర్ 27న విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. అయితే ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుందని చిత్రబృందం ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా పార్ట్ 2 కి సంబంధించి అప్డేట్ను పంచుకుంది చిత్రయూనిట్. ఫస్ట్ పార్ట్ విడుదలై నేటికి ఏడాది పూర్తి చేసుకోవడంతో మూవీ వన్ ఇయర్ పోస్టర్‌ను విడుదల చేసిన చిత్రయూనిట్ దేవర 2 కోసం సిద్ధంగా ఉండండి అంటూ ప్రకటించింది. ఈ సినిమాలో ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో నటించగా.. జాన్వీ కపూర్ కథానాయికగా.. సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్రలో నటించారు. మొదటి భాగాన్ని అద్భుతంగా తీర్చిదిద్దిన కొరటాల శివనే సీక్వెల్‌కు దర్శకత్వం వహించబోతున్నాడు.
Devara1