నాగపూర్ : రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(Rashtriya Swayamsevak Sangh) ఏర్పాటు చేసి నేటికి వందేళ్లు అయ్యింది. డాక్టర్ కేశవ్ బలిరాం హెడ్గేవర్ ఈ సంస్థను ప్రారంభించారు. ఆయనతో పాటు మరో 17 మంది దీనిలో భాగస్వామ్యులయ్యారు. సెప్టెంబర్ 27, 1925 విజయదశమి రోజున ఆర్ఎస్ఎస్ను స్టార్ట్ చేశారు. వందేళ్ల సందర్భంగా ఏడాది పాటు సంబరాలు నిర్వహించనున్నారు. ఆర్ఎస్ఎస్కు దేశవ్యాప్తంగా 83 వేల శాఖలు ఉన్నాయి. లక్షల సంఖ్యలో వాలంటీర్లు ఉన్నారు. హిందువుల్లో ఐక్యత, క్రమశిక్షణ,క్యారెక్టర్ నిర్మాణం ఉద్దేశంతో హెడ్గేవర్ ఆ సంస్థను ప్రారంభించారు. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ పేరును ఓటింగ్ ద్వారా 1926లో ఫైనలైజ్ చేశారు. జరిపాపట్కా మండల్, భారతోదారక్ మండల్ పేర్ల కోసం ఓటింగ్ జరిగింది. నాగపూర్లో ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయం ఉన్నది. ఆ తర్వాత వార్దాలో తొలి శాఖను ప్రారంభించారు. ఆ తర్వాత దేశవ్యాప్తంగా విస్తరించింది.