Devara Movie | టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్ (NTR) హీరోగా.. కొరటాల శివ (Koratala Shiva) దర్శకత్వంలో వస్తున్న చిత్రం ‘దేవర’(Devara). ఈ చిత్రంతో శ్రీదేవి గారలపట్టి జాన్వీకపూర్ (Janvi kapoor) తెలుగు పరిశ్రమకు పరిచయం అవుతుంది. ఇక ఈ సినిమా రెండు భాగాలుగా రానున్నట్లు మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. తొలిభాగం 2024 ఏప్రిల్ 5న విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి తారక్ లుక్‌తో పాటు, సైఫ్ అలీఖాన్, జాన్వీకపూర్ లుక్‌లను రిలీజ్ చేయగా.. ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ సినిమా నుంచి మేకర్స్ క్రేజీ అప్డేట్ ఇచ్చారు.
‘దేవర’ నుంచి జాన్వీకపూర్ కొత్త లుక్ విడుదల చేశారు. ఇక ఈ సినిమాలో జాన్వీ తంగం (Thangam) అనే పాత్రలో కనిపిస్తుందని చిత్ర యూనిట్ ప్రకటించింది. లంగా ఓణీతో పక్కా పల్లెటూరి అమ్మాయిగా కనిపిస్తున్న జాన్వీ లుక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Our Thangam ❤️ #Devara pic.twitter.com/fKAijzxBOO
— Devara (@DevaraMovie) October 31, 2023
ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ప్రస్తుతం గోవాలో కొన్ని హై ఓల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ షూట్ చేస్తున్నారు. ఇందులోని యాక్షన్ సన్నివేశాల కోసం హాలీవుడ్ కొరియోగ్రాఫర్స్ పని చేస్తున్నారు. గోవాలో షూట్ పూర్తి కాగానే మూవీ యూనిట్ గోకర్ణ (Gokarna) షిప్ట్ కానుంది. అక్కడ భారీ సెట్ వేసి కొన్ని సన్నివేశాలు తీయనున్నారు. ఇక చిత్రబృందం ఇప్పటి వరకు విడుదల చేసిన పోస్టర్లతో ‘దేవర’ పై అంచనాలు నెలకొన్నాయి.