Devara Movie | యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన దేవర సినిమా సందడి మరో రెండు వారాల్లో షురూ కానున్న విషయం తెలిసిందే. నందమూరి అభిమానులతో పాటు టాలీవుడ్ ప్రేక్షకులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఈ సినిమా కోసం. కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న ఈ భారీ పాన్ ఇండియా చిత్రం సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే ఈ సినిమా విడుదల దగ్గరపడటంతో వరుస ప్రమోషన్స్ చేస్తుంది. ఇప్పటికే టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్లో జెట్ వేగంతో ప్రమోషన్స్‌లో దూసుకుపోతుంది. ఇదిలావుంటే తాజాగా ఈ చిత్రం అరుదైన రికార్డును క్రియేట్ చేసింది. ఫస్ట్ టైం ఒక సినిమా కటౌట్‌ను సముద్రంలో ఏర్పాటు చేశారు.
ముంబైలోని దాదర్ చౌపట్టి దగ్గర ఈ కటౌట్‌ను ఏర్పాటు చేశారు. వినాయక నిమజ్జనంకు వచ్చే ప్రజలకు ఇది కనిపించనుంది. కాగా.. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోతో పాటు ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. జనతా గ్యారేజ్ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత వీరిద్దరి కాంబోలో ఈ సినిమా రానుండటంతో భారీ అంచనాలు ఉన్నాయి. ఇక రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో జాన్వీకపూర్ కథానాయికగా నటిస్తుండగా, బాలీవుడ్ స్టార్ నటుడు సైఫ్ అలీఖాన్ విలన్ పాత్రలో కనిపించనున్నారు.
A #Devara cutout installed on the Dadar Chowpatty beachfront…
All the major Ganesh Visarjan processions of #Mumbai take place at this spot. pic.twitter.com/tZm25iioe3
— …. (@ynakg2) September 14, 2024
Installed a #Devara cutout on the sea at Dadar Chowpatty in Mumbai ❤️
Spot it during Ganesh Visarjan and capture the moment! pic.twitter.com/JPMfKh6eYM
— Devara (@DevaraMovie) September 14, 2024