అమరావతి : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై ప్రభుత్వ ఉద్యోగులు నిర్వహిస్తున్న ఆందోళనలు ఉధృతం అవుతున్నాయి. ఈనెల 5నుంచి సహాయనిరాకరణకు పిలుపునిస్తున్నట్లు ఉద్యోగ సంఘాల నాయకులు చలో విజయవాడలో భాగంగా మాట్లాడారు. ఈనెల 7 నుంచి సమ్మెను యథావిధిగా నిర్వహిస్తామని వెల్లడించారు. సమ్మె వల్ల ప్రజలకు ఏ మాత్రం అసౌకర్యం కలిగినా ప్రభుత్వానిదే బాధ్యత అని అన్నారు. విద్యుత్, ఆర్టీసీ ఉద్యోగులు కూడా ఉద్యమంలోకి వస్తున్నారని బొప్పరాజు తెలిపారు. ఉద్యోగుల ఉద్యమం అంటే ఏంటో ఈ ప్రభుత్వానికి తెలిసిరావాలని వెల్లడించారు.