కోటపల్లి : మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం పంగిడిసోమారం గ్రామానికి చెందిన రెడ్డి లవలోక అనే గర్భిణి 108 అంబులెన్స్ (108 ambulance) లో ప్రసవించింది (Delivery) . గురువారం ఉదయం లవలోకకు పురిటనొప్పులు రాగా 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న 108 కోటపల్లి సిబ్బంది ఈఎంటీ (EMT ) షహబాస్ గర్భిణిని కోటపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువస్తుండగా పురిటినొప్పులు తీవ్రమయ్యాయి. వెంటనే ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు సమాచారం అందించి వారి సూచనల మేరకు ప్రసవం జరిపించగా ఆడబిడ్డకు జన్మనిచ్చింది. తల్లి, బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉండగా మెరుగైన వైద్య సేవల కోసం కోటపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు.
అత్యవసర సమయంలో అప్రమత్తంగా వ్యవహరించిన 108 సిబ్బంది ఈఎంటీ షహబాష్, పైలట్ ఫరీద్‌ను 108 మంచిర్యాల జిల్లా అధికారి సంపత్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రోగ్రాం మేనేజర్ సామ్రాట్ అభినందించారు.