18 సంవత్సరాల తర్వాత ఢిల్లీలో దంచికొట్టిన వాన
ఢిల్లీలో భారీ వర్షాలు | దేశ రాజధాని ఢిల్లీకి రుతుపవనాలు ఆలస్యంగా చేరినా.. ప్రస్తుతం వర్షాలు దంచికొడుతున్నాయి. జూలైలో ఇప్పటివరకు నగరంలో 381 మిల్లీమీటర్ల వర్షాపాతం నమోదైంది. 2003 తర్వాత జూలైలో ఇదే వర్షాపాతమని ఐఎండీ అధికారులు తెలిపారు. సఫ్దర్‌జంగ్

న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీకి రుతుపవనాలు ఆలస్యంగా చేరినా.. ప్రస్తుతం వర్షాలు దంచికొడుతున్నాయి. జూలైలో ఇప్పటివరకు నగరంలో 381 మిల్లీమీటర్ల వర్షాపాతం నమోదైంది. 2003 తర్వాత జూలైలో ఇదే వర్షాపాతమని ఐఎండీ అధికారులు తెలిపారు. సఫ్దర్‌జంగ్ అబ్జర్వేటరీ పరిధిలో మంగళవారం ఉదయం కేవలం మూడు గంటల్లోనే వంద మిల్లీమీటర్ల వర్షాపాతం నమోదైందని పేర్కొంది. ఇంతకు ముందు 2013, జూలై 21న 123.4 మిల్లీమీటర్ల వర్షాపాతం నమోదైంది. 19 ఏళ్ల తర్వాత తొలిసారిగా ఈ ఏడాది దేశ రాజధానికి రుతుపవనాలు 16 రోజులు ఆలస్యంగా చేరాయి. ఇప్పటి ఈ నెలలో 14 రోజులు వర్షాలు కురిశాయి. భారీ వానలకు ఢిల్లీలోని లోతట్టు ప్రాంతాలను వరద నీరు ముంచెత్తింది.
ఐఎండీ డేటా ప్రకారం.. సఫ్దర్‌జంగ్ అబ్జర్వేటరీ పరిధిలో ఈ నెల 27 వరకు 108 శాతం అధిక వర్షాపాతం రికార్డయింది. సాధారణ వర్షాపాతం 183.5 మిల్లీమీటర్లు. 2003లో ఆల్ టైమ్ రికార్డు స్థాయిలో 632.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. గత కొద్ది సంవత్సరాలుగా వర్షం కురిసే రోజుల సంఖ్య తగ్గిందని స్కైమెట్ వెదర్ వైస్ ప్రెసిడెంట్ (మెట్రాలజీ) మహేశ్ షలావత్ పేర్కొన్నారు. నగరాల్లో తక్కువ వ్యవధిలోనే ఎక్కువ వర్షాపాతం నమోదవుతుందన్నారు. ఇంతకు ముందు మూడు, నాలుగు రోజుల్లో 100 మిల్లీమీటర్ల వర్షాపాతం నమోదైతే.. ప్రస్తుతం ఐదారు గంటల్లోనే రికార్డవుతుందన్నారు. ఈ వర్షాలతో భూగర్భ జలాలు పెరుగవని, వర్షాపాతం నెమ్మదిగా ఉంటే భూమిలోకి నీరు ఇంకే అవకాశం ఉంటుందన్నారు.
ఇవి కూడా చదవండి..
ఆ దేశాలకు వెళ్తే మూడేళ్ల నిషేధం.. పౌరులకు సౌదీ హెచ్చరిక
యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. 18 మంది దుర్మరణం
శ్రీశైలం జలాశయానికి భారీగా వరద.. నేడు గేట్ల ఎత్తివేత
బ్రెజిల్లో ‘కొవాగ్జిన్’ అత్యవసర వినియోగ అనుమతి రద్దు!
Vaccine for children : కోవోవాక్స్ క్లినికల్ ట్రయల్స్‌కు నిపుణుల కమిటీ సిఫారసు
Corona Reinfection : ముంబై వైద్యురాలికి 13 నెలల్లో.. మూడుసార్లు కరోనా పాజిటివ్
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Engilipula Batukamma | సందడిగా.. సంప్రదాయబద్ధంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు..!
ఈఎంసిలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
Bathukamma | జపాన్‌లో బతుకమ్మ సంబురాలు.. టోక్యోలో వెల్లివిరిసిన తెలంగాణ సంస్కృతి
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

