హైదరాబాద్, మార్చి 20 (నమస్తే తెలంగాణ): జాతీయ డిఫెన్స్ కాలేజీ ప్రతినిధులు స్టడీ టూర్లో భాగంగా సోమవారం హైదరాబాద్‌కు రానున్నారు. 56 మంది ప్రతినిధుల బృందం ఉదయం 11 గంటలకు బీఆర్కేభవన్‌లోని సచివాలయంలో ఉన్నతాధికారులతో సమావేశం కానున్నది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, స్వయం సమృద్ధి సాధించిన తీరుపై ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, పట్టణ ప్రగతి, గ్రీన్ బడ్జెట్ గురించి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్‌కుమార్, పల్లె ప్రగతి గురించి కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా, ధరణిపై స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఐజీ శేషాద్రి, రైతు బంధు, రైతు బీమాపై కార్యదర్శి, వ్యవసాయశాఖ కమిషనర్ రఘునందన్‌రావు ఈ బృందానికి వివరిస్తారు.