మాదాపూర్ : అక్రమంగా డిఫెన్స్ లిక్కర్ (Defence liquor) బాటిల్, 100 పేపర్ విస్కీ బాటిళ్లను రవాణా చేస్తుండగా ఎక్సైజ్ పోలీసులు ( Excise Police ) పట్టుకున్న సంఘటన శేర్లింగంపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. శేరిలింగంపల్లి ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ బి లక్ష్మణ్ గౌడ్ వివరాల ప్రకారం డీసీఆర్ఆర్ , శంషాబాద్ డీపీఈవో ఆదేశాల మేరకు శంషాబాద్ ఏఈఎస్ ఆధ్వర్యంలో మియాపూర్ నుంచి బాచుపల్లి వరకు రూట్వాచ్ను నిర్వహించామని తెలిపారు.
ఈ సందర్భంగా మౌలాలికి చెందిన ఉప్పే మదన్మోహన్రావు ఎక్స్ సర్వీస్మెన్ వాహనాన్ని తనిఖీ చేస్తుండగా అతని వద్ద రూ. 24,300 విలువైన డిఫెన్స్ లిక్కర్ బాటిళ్లు (27), 100 పేపర్స్ విస్కీ బాటిళ్లు లభ్యమయ్యాయని వివరించారు. వీటిని అక్రమంగా రవాణా చేస్తున్నట్లు గుర్తించి నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్లు వెల్లడించారు.