కటక్: దేశవాళీ టోర్నీ రంజీ ట్రోఫీలో హైదరాబాద్‌కు పరాజయం తప్పలేదు. బెంగాల్‌తో జరిగిన పోరులో హైదరాబాద్ 72 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. 239 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు.. ఓవర్‌నైట్ స్కోరు 16/3తో ఆదివారం ఆఖరి రోజు రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన హైదరాబాద్ చివరకు 166 పరుగులకు ఆలౌటైంది. ఠాకూర్ తిలక్ వర్మ (90; 9 ఫోర్లు, ఒక సిక్సర్) ఒంటరి పోరాటం చేశాడు. బెంగాల్ బౌలర్లలో ఆకాశ్‌దీప్ 4, షాబాజ్ అహ్మద్ 3 వికెట్లు పడగొట్టారు. బెంగాల్ తొలి ఇన్నింగ్స్‌లో 242 పరుగులు చేయగా.. హైదరాబాద్ 205 రన్స్‌కు పరిమితమైంది. అనంతరం బెంగాల్ రెండో ఇన్నింగ్స్‌లో 201 పరుగులు చేసి హైదరాబాద్‌కు 239 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించిన విషయం తెలిసిందే. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకున్న షాబాజ్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’అవార్డు దక్కింది.