Pawan Kalyan : తమిళ నటుడు ఢిల్లీ గణేష్ మృతికి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, హీరో పవన్ కల్యాణ్ సంతాపం తెలిపారు. ‘తమిళనాడుకు చెందిన ప్రముఖ నటుడు తిరు ఢిల్లీ గణేష్ అవల్ మృతిపట్ల తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నా. ఆయన అద్భుతమైన నటనా జీవితం, 400 చిత్రాలతో భారతీయ సినిమాకి అందించిన సహకారం ప్రేక్షకులపై శాశ్వత ముద్ర వేసింది. భారత వైమానిక దళంలో ఆయన చేసిన మునుపటి సేవ దేశం పట్ల ఆయనకున్న అభిరుచిని, దేశభక్తిని చాటుతున్నది. ఆయన కుటుంబానికి, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి. ఆయన ఆత్మకు శాంతా చేకురాలి’ అని పవన్ కళ్యాణ్ ఎక్స్‌లో పోస్టు పెట్టారు.
Deeply saddened by the death of veteran Tamil actor Thiru Dilli Ganesh Avl. His amazing acting career and contribution to Indian cinema with over 400 films have made a lasting impression on audiences.
His prior service in the Indian Air Force demonstrates his passion and… pic.twitter.com/joMc4eBsEF
— Pawan Kalyan (@PawanKalyan) November 10, 2024
కాగా నటుడు ఢిల్లీ గణేష్ ఎన్నో సినిమాల్లో నటించారు. ఆయన నటగా ప్రతిభతో ప్రేక్షకులను అలరించారు. ఆయన మృతితో తమిళ సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. కొద్ది రోజులుగా ఢిల్లీ గణేష్ అనారోగ్యంతో బాధపడుతున్నారు. శనివారం సాయంత్రం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆస్పత్రిలో చేరారు. చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన తమిళ, తెలుగు, కన్నడ భాషల్లో నటించారు. ఆయన మృతికి తమిళ సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం గణేష్ భౌతికఖాయాన్ని రామాపురంలోని ఆయన నివాసంలో బంధుమిత్రులు, అభిమానుల సందర్శనార్థం ఉంచారు.
ఇవాళ సాయంత్రం ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు. 1944 లో జన్మించిన ఢిల్లీ గణేష్ 1964లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో చేరారు. 1974 వరకు అక్కడే పనిచేసి ఆ తర్వాత సినీ పరిశ్రమలో అడుగుపెట్టారు. తమిళ సీరియళ్లు, సినిమాల్లో నటించారు. సినీ పరిశ్రమలోకి రాకముందు ఢిల్లీకి చెందిన థియేటర్ ట్రూప్‌లో యాక్టింగ్ చేశాడు. అక్కడ గణేష్‌ను చూసిన కే బాలచందర్ అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత ఆయన అనేక సినిమాల్లో నటించారు. దాదాపు 400 సినిమాల్లో ఆయన యాక్టింగ్ చేశారు.
ఢిల్లీ థియేటర్ ట్రూప్‌లో పనిచేయడంతో బాలచందర్ ఆయనకు ఢిల్లీ గణేష్ అనే పేరు పెట్టారు. ఢిల్లీ గణేష్ మైఖేల్ మదన కామ రాజన్, ఆహా, అపూర్వ సగోధరార్గళ్, సింధు భైరవి , నాయకన్ , తెనాలి , ఎంగమ్మ మహారాణి వంటి హిట్ సినిమాల్లో నటించారు.