హనుమకొండ చౌరస్తా, సెప్టెంబర్ 25: హనుమకొండలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలో పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ (Pandit Deen Dayal Upadhyay) జయంతి ఘనంగా నిర్వహించారు. మేరా యువ భారత్ (Mera Yuva Bharat) డిప్యూటీ డైరెక్టర్ చింతల అన్వేష్ (Chinthala Anvesh) ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. అన్వేష్ మాట్లాడుతూ.. హైందవ సిద్ధాంతకర్త, ప్రజా నాయకుడు, భారతీయ ముఖ్యనేతగా గుర్తింపు పొందిన దీన్‌దయాల్ ఉపాధ్యాయ జయంతి నిర్వహించినట్లు తెలిపారు.
ఈ సందర్భంగా నిర్వహించిన క్విజ్ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ ఆర్.శ్రీనివాసరావు, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ ఎస్.రాజ్‌కుమార్, అధ్యాపకులు సంధ్యారాణి, సువర్ణ, జ్యోతి, రాజేష్, మేరా యువ భారత్ వాలంటీర్ బానోతు వీరన్న, విద్యార్థులు పాల్గొన్నారు.