న్యూఢిల్లీ: జాతీయ బాక్సింగ్ శిక్షణా శిబిరానికి రెండు వేర్వేరు జట్లను గురువారం ఎంపిక చేశారు. ప్రపంచ బాక్సింగ్ చాంపియన్ సన్నాహకాల్లో భాగంగా 13 రోజుల పాటు జరిగే శిబిరానికి రాష్ట్ర యువ బాక్సర్ నిఖత్ జరీన్ ఎంపికైంది. ఇటీవల జరిగిన జాతీయ టోర్నీలో పతకంతో మెరిసిన నిఖత్.. మళ్లీ ప్రాక్టీస్ బాట పట్టింది. రోహ్తక్ శిబిరంలో నిఖత్‌తో పాటు టోక్యో ఒలింపిక్స్ కాంస్య విజేత లవ్లీనా బొర్గోహై, పూజా రాణి జాబితాలో చోటు దక్కించుకున్నారు. ఇదిలా ఉంటే ఆరు సార్లు ప్రపంచ చాంపియన్ మేరీకోమ్‌కు నిరాశే ఎదురైంది. సెలెక్టర్లు ఆమెను పక్కకు పెడుతూ నిర్ణయం తీసుకున్నారు. దీనిపై ఆమె స్పందిస్తూ ప్రస్తుతం తన నివాసంలోనే శిక్షణ తీసుకుంటున్నట్లు జనవరి నెల మధ్య నుంచి సీరియస్‌గా ప్రాక్టీస్ చేస్తానని పేర్కొంది. మరోవైపు పటియాల క్యాంప్‌లో 52 మంది పురుష బాక్సర్లు శిక్షణ క్యాంప్‌లో పాల్గొంటారు. ఇందులో అమిత్ పంగల్‌ను మినహాయిస్తూ శివ తాపా, దీపక్ కుమార్, కవిందర్ బిస్త్‌ను ఎంపిక చేశారు.