హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 16 (నమస్తే తెలంగాణ): కొవిషీల్డ్ రెండో డోస్‌తో రోగ నిరోధక శక్తి తగ్గుతున్నదా? దీనివల్ల వైరస్ ముప్పు మళ్లీ పెరిగే అవకాశం ఉన్నదా? అంటే అవుననే అనుమానాలు వస్తున్నాయి. ఆక్స్ఫర్డ్, ఆస్ట్రాజెనెకా, సీరం ఇన్స్టిట్యూట్ తయారుచేసిన కొవిషీల్డ్ రెండో డోస్ వేసుకొన్నాక.. మూడు నెలల్లో రోగ నిరోధక శక్తి 47 శాతానికి పడిపోయినట్టు తాజా అధ్యయనాల్లో గుర్తించారు. మొదటి డోస్‌తో సత్ఫలితాలే వస్తున్నా, రెండో డోస్ వేసుకొన్నాక ఇమ్యూనిటీ స్థాయి తగ్గుతున్నట్టు తేలింది. ఈ నేపథ్యంలో కొవిషీల్డ్ మొదటి డోస్ తీసుకొన్నవారి కోసం కేంద్ర ప్రభుత్వం కొత్త గైడ్‌లైన్స్ విడుదల చేసే అవకాశం కనిపిస్తున్నది. రోగ నిరోధక శక్తి క్షీణిస్తే కరోనా ముప్పు మళ్లీ పెరిగే ప్రమాదం పొంచి ఉన్నదని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే యూరప్ దేశాల్లో ఇదే పరిస్థితి నెలకొన్నది.