Philippines : సెంట్రల్ ఫిలిప్పీన్స్ లో కొండ చరియలు విరిగిపడటంతో నలుగురు మృతి చెందగా, 36 మందికి పైగా శిథిలాల కింద చిక్కుకుపోయారు. ఈ ఘటన గురువారం సాయంత్రం, సెబూ నగర సరిహద్దులోని ఒక పర్వత ప్రాంతంలోని ప్రైవేటు వ్యర్థ నిర్వహణ కేంద్రం వద్ద జరిగింది. కొండ ప్రాంతం నుంచి ఒక్కసారిగా కొండ చరియలు విరిగిపడ్డాయి. దీంతో దిగువన ఉన్న ఆ గ్యార్బేజ్ లోని వారు, ఇతరులు చిక్కుకున్నారు.
ఈ ఘటనలో నలుగురు మరణించగా, 36 మందికి పైగా శిథిలాల కింద చిక్కుకున్నట్లు అనుమానిస్తున్నారు. సమాచారం అందుకున్న రక్షణ దళాలు సహాయక చర్యలు ప్రారంభించాయి. దాదాపు రెండు రోజులుగా శిథిలాల తొలగింపు కొనసాగుతోంది. శిథిలాల కింద కొందరు జీవించే ఉన్నట్లు గుర్తించామని, సహాయం కోసం వారి అరుపులు వినిపిస్తున్నాయని అధికారులు తెలిపారు. వారిని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. ఈ ప్రమాదానికి గురైన వారిలో అక్కడి కార్మికులే ఎక్కువగా ఉన్నారు. ఈ సహాయ కార్యక్రమాల్లో దాదాపు 300 మంది సిబ్బంది పాల్గొంటున్నారు. శిథిలాల్ని వేగంగా తొలగించేందుకు ప్రయత్నిస్తున్నామని అధికారులు అంటున్నారు.
A short while ago: A landslide struck a landfill in Cebu City, Philippines, leaving several residents trapped, according to Councilor Dave Tumulak. pic.twitter.com/jkLkmfpcFE
— Weather Monitor (@WeatherMonitors) January 8, 2026
ఈ ఘటనకు గల కారణాల్ని అణ్వేషిస్తున్నామని తెలిపారు. కొంతకాలం క్రితం ఈ ప్రాంతంలో భూకంపం సంభవించిందని, దీని కారణంగా అక్కడి భూమి, కొండ చరియల్లో స్థిరత్వం పోవడం వల్ల ఈ ప్రమాదం జరిగి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు.