Bhagavan Das | భగవాన్ దాస్ ఆశయాలు నేటికీ చిరస్మరణీయం : దాస్యం వినయ్ భాస్కర్
ప్రముఖ కార్మిక నాయకుడు, కమ్యూనిస్టు యోధుడు బీఆర్ భగవాన్ దాస్ ఆశయాలు నేటికీ చిరస్మరణీయం అని మాజీ ప్రభుత్వ చీఫ్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు.
హనుమకొండ చౌరస్తా, అక్టోబర్ 12 : ప్రముఖ కార్మిక నాయకుడు, కమ్యూనిస్టు యోధుడు బీఆర్ భగవాన్ దాస్ ఆశయాలు నేటికీ చిరస్మరణీయం అని మాజీ ప్రభుత్వ చీఫ్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. సోమవారం బీఆర్ భగవాన్ దాస్ 23వ వర్ధంతి కార్యక్రమాన్ని హనుమకొండలోని బీఆర్ భగవాన్ దాస్ విగ్రహం వద్ద ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ నాయకులతో కలిసి వినయ్ భాస్కర్ భగవాన్ దాస్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం మీడియాతో వినయ్ భాస్కర్ మాట్లాడుతూ భగవాన్ దాస్ భౌతికంగా దూరమై 23 ఏండ్లు గడిచినా ఆయనను నేటికీ ప్రజలు స్మరించుకుంటూనే ఉన్నారని అన్నారు.
నీతి, నిజాయితీ, నిబద్ధతతో ప్రజల కోసం పనిచేసిన బీఆర్ ఆశయాలు నేటికీ చిరస్మరణీయం అన్నారు. కార్మిక సమస్యలపై నిరంతరం కృషి చేసిన బీఆర్ భగవాన్ దాస్ సంఘటిత, అసంఘటిత రంగ కార్మికుల హక్కుల పరిరక్షణకు కృషి చేశారని అన్నారు. ప్రభుత్వ స్థలాలను అన్యాక్రాంతం కాకుండా పరిరక్షించారని, ఆయన కాపాడిన స్థలంలోనే నేడు కాళోజీ కళాక్షేత్రం నిర్మించడం జరిగిందని చెప్పారు. కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ స్థాపించి ఈ ప్రాంత నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలని పోరాడారని గుర్తు చేశారు. నగరంలో పేదల ఇండ్ల స్థలాల కోసం, గుడిసె వాసులకు పట్టాల కోసం సిపిఐ ఆధ్వర్యంలో భగవాన్ దాస్ ఉద్యమించారని అన్నారు. ఆయన ఆశయాలను నేటి తరం ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ హనుమకొండ జిల్లా కార్యదర్శి కర్రె బిక్షపతి, మహిళా సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నేదునూరి జ్యోతి, సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సిరబోయిన కరుణాకర్, జిల్లా సహాయ కార్యదర్శులు తోట బిక్షపతి, మద్దెల ఎల్లేష్, నాయకులు కర్రె లక్ష్మణ్, ఎన్. రాజమౌళి, ఏదునూరి వెంకట్రాజం, ఏశబోయిన శ్రీనివాస్, బత్తిని సదానందం, మాలోతు శంకర్, మెట్టు శ్యామ్ సుందర్ రెడ్డి, భగవాన్ దాస్ కుమారులు డాక్టర్ బీఆర్ అంబేద్కర్, డాక్టర్ బి. రాజ్ సిద్దార్థ, బీఆర్ లెనిన్, మాజీ కార్పొరేటర్ లు మంచాల స్వామిచరణ్, జోరిక రమేష్, సారంగపాణి, జర్నలిస్టు నాయకులు పివి మదన్ మోహన్, తోట సుధాకర్, బొల్లారపు సదయ్య, బొడిగె శ్రీనివాస్, ఎండీ నయీం పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bhagavan Das | భగవాన్ దాస్ ఆశయాలు నేటికీ చిరస్మరణీయం : దాస్యం వినయ్ భాస్కర్
North Korea: బాలిస్టిక్ క్షిపణులను పరీక్షించిన ఉత్తర కొరియా
Aadarsha Kutumbam | ఆదర్శ కుటుంబంలో అదిరిపోయే సర్ప్రైజ్.. వెంకటేష్ అభిమానులకు త్రివిక్రమ్ ట్రీట్!
Road Accident | మద్యం మత్తులో కారు నడిపి స్కూటీని ఢీకొట్టిన యువకుడు.. ముగ్గురు దుర్మరణం..!
Mythri Movie Makers | మైత్రీ మూవీ మేకర్స్ నుంచి మరో రొమాంటిక్ కామెడీ.. డెబ్యూ ఇస్తున్న శ్రీకాంత్ కుమార్తె
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

