Road Accident | మద్యం మత్తులో కారు నడిపి స్కూటీని ఢీకొట్టిన యువకుడు.. ముగ్గురు దుర్మరణం..!
Road Accident | మద్యం మత్తులో వేగంగా కారు నడిపిన ఓ యువకుడు బలంగా స్కూటీని ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో స్కూటీపై ఉన్న ముగ్గురు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. ఆదివారం తెల్లవారుజామున కేరళం (Keralam) రాష్ట్రం కొచ్చి (Kochi) లోని నెడుంబాస్సేరి (Nedumbasseri) సమీపంలో ఈ ప్రమాదం జరిగింది.
Road Accident : మద్యం మత్తులో వేగంగా కారు నడిపిన ఓ యువకుడు బలంగా స్కూటీని ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో స్కూటీపై ఉన్న ముగ్గురు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. ఆదివారం తెల్లవారుజామున కేరళం (Keralam) రాష్ట్రం కొచ్చి (Kochi) లోని నెడుంబాస్సేరి (Nedumbasseri) సమీపంలో ఈ ప్రమాదం జరిగింది.
మరణించిన వారిని వయనాడ్‌లోని మడక్కిమలకు చెందిన దేవిక, మంగళూరులోని సుల్లియాకు చెందిన ఇజాజ్, పాలక్కాడ్‌లోని కరింబాకు చెందిన గోపికగా గుర్తించారు. 21 ఏళ్ల వయసున్న వీరు ముగ్గురూ కొచ్చిలోని త్రికక్కరలో హ్యాండ్లూమ్ సేల్స్ సంస్థలో పనిచేస్తున్నారు. వారు టీ తాగడానికి బయటకు వెళ్లిన సమయంలో ఈ ప్రమాదం జరిగింది.
పోలీసుల వెల్లడించిన కథనం ప్రకారం.. నిందితుడు సుహైల్ సజీవ్ తన BMW మినీ కూపర్ కారులో స్నేహితులను తీసుకురావడానికి నెడుంబాసేరి విమానాశ్రయానికి వెళ్తుండగా ఒక స్కూటీని ఢీకొట్టాడు. ఆ వాహనాన్ని దాదాపు 100 మీటర్ల దూరం వరకు రోడ్డుపై ఈడ్చుకుంటూ వెళ్లి ఆపాడు. సుహైల్ అక్కడి నుంచి పారిపోయే ప్రయత్నిం చేయగా.. స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు.
ప్రమాదానికి ముందు సుహైల్ మూడు బార్లలో మద్యం సేవించినట్లు పోలీసులు గుర్తించారు. అతను ఏదైనా డ్రగ్ ప్రభావంతో వాహనం నడిపాడా లేదా అని నిర్ధారించుకోవడానికి అతనికి బ్లడ్ రిపోర్ట్స్ కోసం చూస్తున్నారు. ఆ 19 ఏళ్ల యువకుడికి మద్యం అమ్మిన బార్ల నిర్వాహకులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఎక్సైజ్ శాఖ మంత్రి ఎం లిజు ఆదేశించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Aadarsha Kutumbam | ఆదర్శ కుటుంబంలో అదిరిపోయే సర్ప్రైజ్.. వెంకటేష్ అభిమానులకు త్రివిక్రమ్ ట్రీట్!
Road Accident | మద్యం మత్తులో కారు నడిపి స్కూటీని ఢీకొట్టిన యువకుడు.. ముగ్గురు దుర్మరణం..!
Mythri Movie Makers | మైత్రీ మూవీ మేకర్స్ నుంచి మరో రొమాంటిక్ కామెడీ.. డెబ్యూ ఇస్తున్న శ్రీకాంత్ కుమార్తె
IAS Transfers | ఏపీలో పలువురు ఐఏఎస్‌ల బదిలీ.. పర్యాటక శాఖ కార్యదర్శిగా ఆమ్రపాలికి పోస్టింగ్!
Chiranjeevi | చిరంజీవి ‘కాకా’ సినిమాలో బాలయ్య కుమార్తె తేజస్విని.. బాబీ సంప్రదించడంపై భరత్ ఏమన్నారంటే!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

