North Korea: బాలిస్టిక్ క్షిపణులను పరీక్షించిన ఉత్తర కొరియా
North Korea: ఉత్తరకొరియా పలు బాలిస్టిక్ క్షిపణులను పరీక్షించింది. తూర్పు సముద్ర జలాలపై వైపు ఇవాళ క్షిపణులను పరీక్షించినట్లు దక్షిణ కొరియా మిలిటరీ ఆరోపించింది. కొరియా దేశాల మధ్య ప్రస్తుతం ఉద్రిక్త వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే.
సియోల్: ఉత్తర కొరియా(North Korea) తన ఆయుధ సంపదను పెంచుకుంటోంది. తాజాగా పలు బాలిస్టిక్ క్షిపణులను ఆ దేశం పరీక్షించింది. తూర్పు సముద్ర జలాలపై వైపు ఇవాళ క్షిపణులను పరీక్షించినట్లు దక్షిణ కొరియా మిలిటరీ ఆరోపించింది. కొరియా దేశాల మధ్య ప్రస్తుతం ఉద్రిక్త వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే. దక్షిణకొరియా సంయుక్త దళాల ప్రతినిధి జాంగ్ డో యుంగ్ మాట్లాడుతూ ఉత్తర కొరియా రాజధాని ప్యోంగ్యాంగ్ నుంచి పలు రకాల క్షిపణులను పరీక్షించినట్లు చెప్పారు. ప్రధాన విమానాశ్రయాన్నే గత కొన్నేళ్ల నుంచి కీలక లాంచింగ్ సైట్‌గా ఉత్తర కొరియా వాడుకుంటోంది.
ఉత్తర కొరియా పరీక్షించిన ఓ క్షిపణి సుమారు 900 కిలోమీటర్ల దూరం ప్రయాణించినట్లు జాంగ్ వెల్లడించారు. అయితే ఎన్ని క్షిపణులను డిటెక్ట్ చేశారన్న విషయాన్ని మాత్రం చెప్పలేదు. జపాన్ డిప్యూటీ రక్షణ మంత్రి తకాశి కోయరి మాట్లాడుతూ 17 నిమిషాల తేడాతో రెండు క్షిపణులను డిటెక్ట్ చేసినట్లు చెప్పారు. ఎకనామిక్ జోన్ బయటి ప్రదేశంలో ఉన్న జలాల్లో ఆ క్షిపణులు పడినట్లు తెలుస్తోంది.
తొలి క్షిపణి సుమారు 220 కిలోమీటర్ల దూరం ప్రయాణించి, రెండో క్షిపణి సుమారు 910 కిలోమీటర్ల దూరం ప్రయాణించినట్లు జపాన్ అధికారి చెప్పారు. బహుశా హైపర్సోనిక్ ఆయుధాన్ని పరీక్షించి ఉంటారని ఆయన అన్నారు. ఎయిర్‌క్రాఫ్ట్ కానీ నౌకలకు కానీ ఎటువంటి ఇబ్బందికాలేదన్నారు. అణు సామర్థ్యం కలిగిన ఆయుధాలను సిద్ధం చేసేందుకు ఉత్తర కొరియా చాన్నాళ్లుగా ప్రయత్నిస్తున్నది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
North Korea: బాలిస్టిక్ క్షిపణులను పరీక్షించిన ఉత్తర కొరియా
Aadarsha Kutumbam | ఆదర్శ కుటుంబంలో అదిరిపోయే సర్ప్రైజ్.. వెంకటేష్ అభిమానులకు త్రివిక్రమ్ ట్రీట్!
Road Accident | మద్యం మత్తులో కారు నడిపి స్కూటీని ఢీకొట్టిన యువకుడు.. ముగ్గురు దుర్మరణం..!
Mythri Movie Makers | మైత్రీ మూవీ మేకర్స్ నుంచి మరో రొమాంటిక్ కామెడీ.. డెబ్యూ ఇస్తున్న శ్రీకాంత్ కుమార్తె
IAS Transfers | ఏపీలో పలువురు ఐఏఎస్‌ల బదిలీ.. పర్యాటక శాఖ కార్యదర్శిగా ఆమ్రపాలికి పోస్టింగ్!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

