హైదరాబాద్, అక్టోబర్ 1(నమస్తే తెలంగాణ): ఖైరతాబాద్ కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు రచ్చకెక్కాయి. మాజీ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు వ్యతిరేకంగా న్యూఢిల్లీలోని తెలంగాణభవన్ ప్రధాన గేటు వద్ద ‘సికింద్రాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ లీడర్స్ అండ్ వర్కర్స్’ పేరుతో భారీ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. ఈ పరిణామం కాంగ్రెస్‌లో కలకలం రేపుతున్నది.
సికింద్రాబాద్ పార్లమెంట్ కమిటీ పేరుతో వెలిసిన ఈ ఫ్లెక్సీలో దానం రాజకీయ వైఖరిపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తమైంది. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున గెలిచి, తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ గూటికి చేరిన నాగేందర్‌ను పార్టీ క్యాడర్ ఎంతమాత్రం ఆమోదించడం లేదని ఆ ఫ్లెక్సీలో పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో ఖైరతాబాద్ నుంచి దానం నాగేందర్ మళ్లీ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తే కనీసం డిపాజిట్ కూడా దక్కదని హెచ్చరించారు.