దళిత యువకుడికి అవమానం
వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం మంగంపల్లిలో దళిత యువకుడు ఆలయంలోకి వెళ్లినందు కు వనపర్తి ఎమ్మెల్యే బంధువులు కుల దూషణలతో విరుచుకుపడిన ఘటన మంగళవారం వెలుగులోకి వచ్చింది.
- ఆలయంలోకి వెళ్లినందుకు దూషణలు
- కాంగ్రెస్ ఎమ్మెల్యే బంధువులపై ఆరోపణలు
- దళిత సంఘాల నిరసన.. ఎస్పీకి వినతి
పెద్దమందడి, అక్టోబర్ 13 : వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం మంగంపల్లిలో దళిత యువకుడు ఆలయంలోకి వెళ్లినందుకు వనపర్తి ఎమ్మెల్యే బంధువులు కుల దూషణలతో విరుచుకుపడిన ఘటన మంగళవారం వెలుగులోకి వచ్చింది. వివరాల్లో వెళితే.. మంగంపల్లిలో పురాతన గుడిని తొలగించి నూతన ఆలయ నిర్మాణం కోసం ఎమ్మెల్యే మేఘారెడ్డి ప్రభుత్వం నుంచి రూ.కోటి మంజూరు చేయించారు. పాత ఆలయాన్ని తొలగించే సందర్భంగా జరిగిన పూజలో ఆలయంలోకి వెళ్లిన త నను స్థానిక ఎమ్మెల్యే మేనమామ వెంకటరామిరెడ్డి, శ్రీనివాసరెడ్డి ‘ఇది మా గుడి, నువ్వు ఎందుకు వచ్చావు’? అంటూ అవమానపరిచారని దళిత యువకుడు సుధీర్ ఆరోపించాడు.
ఒకరోజు ముందే వనపర్తికి వెళ్లి దళితులమంతా గుడిలోకి ప్రవేశిస్తామని ఎమ్మెల్యేకు లెటర్ కూడా ఇవ్వగా ఊరికి వచ్చినప్పుడు మాట్లాడదాం అని చె ప్పారని తెలిపారు. ఎమ్మెల్యే రాక ఆలస్యం కావడంతో గుడిలో విగ్రహాలు తీస్తున్నారని తెలిసి కుటుంబ సభ్యులతో కలిసి దేవుడి దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత వెంకట్రామిరెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి అవమానపరిచారని వాపోయాడు. ఎమ్మెల్యే వచ్చాక ఆయన దృష్టికి విషయాన్ని తీసుకెళ్లగా అందరూ ఐక్యంగా ఉండాలని సూచించారని వెల్లడించారు. ఈ ఘటనపై దళిత సం ఘాలు ఆగ్రహం వ్యక్తంచేశాయి. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఎస్పీ సునీతారెడ్డికి వినతిపత్రం అందజేశారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

