మంత్రి బాత్రూమ్కు రూ.కోటి?
ఖజానా ఖాళీ అయింది.. ఎక్కడా చిల్లిగవ్వ అప్పు కూడా పుట్టడం లేదంటున్న ప్రభుత్వం.. మరోవైపు మంత్రుల నివాసాల విలాసాలకు మాత్రం రూ.కోట్లలో ఖర్చు చేస్తుండటం విమర్శలకు తావిస్తున్నది.
- జూపల్లి అధికార నివాసంలో పనుల కోసం టెండర్లు పిలిచిన ఆర్అండ్బీ
- రూపాయి అప్పు పుట్టడం లేదంటూనే సర్కార్ దుబారాపై విమర్శల వెల్లువ
హైదరాబాద్, అక్టోబర్ 13(నమస్తే తెలంగాణ) : ఖజానా ఖాళీ అయింది.. ఎక్కడా చిల్లిగవ్వ అప్పు కూడా పుట్టడం లేదంటున్న ప్రభుత్వం.. మరోవైపు మంత్రుల నివాసాల విలాసాలకు మాత్రం రూ.కోట్లలో ఖర్చు చేస్తుండటం విమర్శలకు తావిస్తున్నది. ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారిక నివాసంలో బాత్రూమ్లు, ఇతర భవన మరమ్మతుల కోసం ఏకంగా రూ.92,63,371 ఖర్చు చేసేందుకు ఆర్అండ్బీ టెండర్లు పిలువడం చర్చనీయాంశమైంది.
ఒక మంత్రి నివాసంలో సదుపాయాల కోసం కోటి రూపాయల ప్రజాధనాన్ని నీళ్లలా ఖర్చు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. సంక్షేమ పథకాలు, అత్యవసర అభివృద్ధి పనులకు నిధులు సర్దుబాటు చేయలేక, ఉద్యోగుల రిటైర్మెంట్ ప్రయోజనాలకు ఎగనామం పెడుతున్న ప్రభుత్వం.. మంత్రుల లగ్జరీ లివింగ్ కోసం ప్రజాధనాన్ని దుబారా చేయడం ముమ్మాటికీ ప్రజాద్రోహమేనని విపక్షాలు మండిపడుతున్నాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

