కరెంటియ్యని రేవంత్ దిగిపో
కోతలు లేకుండా కరెంటిచ్చి పంటలను కాపాడాలని రైతులు కాంగ్రెస్ సర్కార్‌ను డిమాండ్ చేస్తున్నారు. పొట్ట దశకు వచ్చిన పంటలకు ఇప్పుడు కరెంటియ్యకపోతే నీళ్లు అందక ఎండిపోయే ప్రమాదం ఉన్నదని ఆందోళన వ్యక్తంచేశారు. కరెంటియ్యడం చేతగాకపోతే దిగిపోవాలని సీఎం రేవంత్‌రెడ్డిని రైతులు డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం పలు జిల్లాల్లో రైతులు రోడ్డెక్కారు.
- విద్యుత్తు లేక ఎండిపోతున్న పంటలు
- అసమర్థ పాలన ఇక చాలంటున్న రైతులు
- కరెంట్ కోసం పలుచోట్ల ఆందోళనలు
నమస్తే తెలంగాణ నెట్వర్క్, అక్టోబర్ 13: కోతలు లేకుండా కరెంటిచ్చి పంటలను కాపాడాలని రైతులు కాంగ్రెస్ సర్కార్‌ను డిమాండ్ చేస్తున్నారు. పొట్ట దశకు వచ్చిన పంటలకు ఇప్పుడు కరెంటియ్యకపోతే నీళ్లు అందక ఎండిపోయే ప్రమాదం ఉన్నదని ఆందోళన వ్యక్తంచేశారు. కరెంటియ్యడం చేతగాకపోతే దిగిపోవాలని సీఎం రేవంత్‌రెడ్డిని రైతులు డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం పలు జిల్లాల్లో రైతులు రోడ్డెక్కారు. సబ్స్టేషన్లను ముట్టడించడంతోపాటు ధర్నాలు, రాస్తారోకోలు చేపట్టారు. మెదక్ జిల్లా రామాయంపేట మండలం ప్రగతి ధర్మారంలో రైతులు రోడ్డుపై రాస్తారోకో చేపట్టారు.
నాగర్‌కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం మహదేవునిపేట రైతులు రాస్తారోకో చేపట్టారు. మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండలం చిన్నముప్పారం సబ్‌స్టేషన్ ఎదుట రైతులతో కలిసి బీఆర్ఎస్ నాయకులు ధర్నా చేశారు. నల్లగొండ జిల్లా గుర్రంపోడ్లో దేవరకొండ -నల్లగొండ ప్రధాన రహదారిపై బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతులు ధర్నా నిర్వహించారు. పెద్ద సంఖ్యలో రైతులు తరలివచ్చి నిరసన తెలిపారు. ముందుగా బీఆర్ఎస్ నాయకలు కడారి అంజయ్య యాదవ్, స్థానిక నాయకుడు పావం గోపాల్‌రెడ్డితో కలిసి సబ్‌స్టేషన్ ఎదుట రాస్తారోకో చేశారు. విద్యుత్తు ఏఈ శ్రీకాంత్‌రెడ్డిని నిలదీశారు. ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి మాట్లాడుతూ.. వ్యవసాయ రంగానికి నాణ్యమైన కరెంట్ సరఫరా చేయడంలో కాంగ్రెస్ సరార్ పూర్తిగా విఫలమైందని అన్నారు.

నాణ్యమైన కరెంట్ అందించాలని డిమాండ్ చేస్తూ జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం చెల్పూర్లోని ఎన్‌హెచ్-353పై బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ.. కరెంటు కోతలతో పంటలన్నీ ఎండిపోతున్నా కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. రోజుకు ఐదారు గంటల కరెంట్ మాత్రమే కరెంటు ఇస్తున్నారని, అదీకూడా లోవోల్టేజీ, ఎల్సీల పేరుతో కట్ చేస్తున్నారని, దీంతో బోరుమోటర్లు కాలిపోయి రైతులు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నట్టు తెలిపారు.
సూర్యాపేట జిల్లా మోతె మండలంలోని రాఘవపురం ఎక్స్‌రోడ్డు వద్ద ఎండిపోయిన పంట పొలాలను కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ పరిశీలించారు. అనంతరం లాల్‌తండా సబ్‌స్టేషన్‌కు వెళ్లి లాగ్‌బుక్‌లను పరిశీలించారు. రైతులకు నాణ్యమైన, నిరంతర విద్యుత్తు సరఫరా చేయడంలో ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన వ్యక్తి నీటిపారుదల శాఖ మంత్రిగా ఉండి కూడా ఈ ప్రాంత రైతాంగానికి సాగునీరు అందించకపోవడం దురదృష్టకరమని అన్నారు.
కాంగ్రెస్ సర్కార్‌కు మా ఉసురు తగుల్తది

మెదక్ జిల్లా రామాయంపేట మండలం ప్రగతి ధర్మారంలో గజ్వేల్-రామాయంపేట రోడ్డుపై నాలుగైదు గ్రామాల రైతులు బైఠాయించారు. రెండు గంటలపాటు రోడ్డుపై నిరసన తెలుపడంతో వాహనాలు నిలిచిపోయాయి. ‘సార్లు.. మా పంటలు ఎండిపోతున్నయ్.. కరెంట్ కనీసం రెండు గంటలు కూడా రావడంలేదు. ఇదేంటని అడిగితే సబ్‌స్టేషన్ ఆపరేటర్లు బెదిరిస్తున్నారు’ అని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ‘సీఎం రేవంత్‌రెడ్డి.. నీ అసమర్థ పాలన మాకు చాలు.. ఇక దిగిపో’ అంటూ మండిపడ్డారు. ఎన్నికల ముందు ఇచ్చిన మాట నిలుపుకోకపోతే రాబోయే ఎన్నికల్లో అంతకంతకూ అనుభవించాల్సి వస్తుందని దుమ్మెత్తి పోశారు. ‘మాకు కరెంట్ సక్రమంగా ఇయ్యని పాలకులకు మా ఉసురు తగులక మానదు’ అని హెచ్చరించారు.
మేజర్ తూము లీకేజీతో నీరంతా వృథా

నల్లగొండ జిల్లా నిడమనూరు మండలం ముప్పారం సమీపంలోని నాగార్జునసాగర్ ఎడుమ ప్రధాన కాలువపై 31వ కిలోమీటరు వద్ద నర్సింహులగూడెం మేజర్ తూముకు లీకేజీ ఏర్పడింది. మేజర్ తూము నీటి ప్రవాహ సామర్థ్యం 3 క్యూసెక్కులు కాగా ప్రస్తుతం 5 క్యూసెక్కుల నీరు విడుదలవుతున్నది. రైతుల ఫిర్యాదు మేరకు ఎన్ఎస్పీ ఎస్ఈ బీవీ మల్లికార్జున్‌రావు, మిర్యాలగూడ ఈఈ గోపీనాథ్, డీఈలు కే స్వామి, జనార్దన్, నీటిపారుదల శాఖ డీఈ ప్రేమ్ కుమార్ తూమును పరిశీలించారు. తూము లోపలి అడుగు భాగంలో షట్టర్ పక్కన కాంక్రీట్ నిర్మాణం ధ్వంసమైనట్టు భావించి తాత్కాలిక మరమ్మతు చర్యలు చేపట్టారు. తూము లీకేజీ కారణంగా నీరంతా వృథా అవుతున్నదని రైతులు ఆందోళన చెందుతున్నారు. – నిడమనూరు


Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

