ఎదులాపురం, సెప్టెంబర్ 19: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దళిత బస్తీతో పేద కు టుంబాలల్లో వెలుగులు నిండాయని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. జిల్లా కేం ద్రం లో బేల మండలానికి చెందిన మూడు దళిత కుటుంబాలకు దళిత బస్తీ పట్టాలను ఎమ్మెల్యే మంగళవారం అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దళితుల అభ్యున్నతికి దళి త బస్తీ ద్వారా మూడెకరాల భూమిని అందించి పట్టాదారులుగా గుర్తింపునిచ్చిందన్నారు. అలాగే వ్యవసాయ కూలీ నుంచి రైతులుగా మార్చింద న్నారు. సొంత భూమిలో పలు రకాల పంటలు పండించుకుంటూ ఆర్థికంగా ఎదగడమే లక్ష్యంగా దళితబస్తీ పథకం ఉపయోగపడుతందన్నారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రావుత్ మనోహ ర్, సర్పంచ్ ఇంద్రశేఖర్, దేవన్న, తన్వీర్, పుతిన్ తదితరులున్నారు.
సత్తా చాటడం అభినందనీయం
సినిమా ఇండస్ట్రీలో తెలంగాణ వాసులు సత్తా చాటడం అభినందనీయమని, ఆదిలాబాద్ లో ఉన్న కళాకారులను ప్రోత్సహించేందుకు పూర్తి గా సహకరిస్తానని ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. తెలంగాణ టీవీ, సినిమా, డాన్సర్స్ అసోసియేషన్ , తెలంగాణ ఫిలిం డాన్స్ అండ్ డైరెక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హైదారాబాద్లో నిర్వహించిన దశాబ్ధివేడుకల్లో కళాశారులను ఎంపిక చేశా రు.
ఇందులో జిల్లా నుంచి ఆరుగురు కళాకారు లు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కేం ద్రంలో ఎమ్మెల్యే జోగు రామన్న కళాకారులను మంగళవారం అభినందించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కళాకారులకు ప్రభుత్వం అండగా నిలుస్తున్నదన్నారు. ఈ కార్యక్రమంలో మాస్టర్ మిట్టు దత్తు, సీనియర్ మాస్టర్ కొంకటి శ్రావణ్ కుమార్, కళాకారుడు పవన్ కళ్యాణ్, రాజేశ్, మహతి తదితరులున్నారు.