‘తౌటే’పై సీఎం ఉద్ధవ్ సమీక్ష
‘తౌక్టే’పై సీఎం ఉద్ధవ్ సమీక్ష | తౌక్టే తుఫాను నేపథ్యంలో మహారాష్ట్రలోని ముంబై, థానే, పలు తీరప్రాంత జిల్లాల్లో పరిస్థితిపై సీఎం ఉద్ధవ్ ఠాక్రే సోమవారం సమీక్ష నిర్వహించారు.

ముంబై : తౌటే తుఫాను నేపథ్యంలో మహారాష్ట్రలోని ముంబై, థానే, పలు తీరప్రాంత జిల్లాల్లో పరిస్థితిపై సీఎం ఉద్ధవ్ ఠాక్రే సోమవారం సమీక్ష నిర్వహించారు. రత్నగిరి, సింధుదుర్గ్, రాయ్‌గఢ్ జిల్లాల తీర ప్రాంతాల్లో నివసిస్తున్న 12,420 మందిని సురక్షితమైన ప్రదేశాలకు తరలించినట్లు అధికారులు సీఎంకు తెలిపారు. వీరిలో రాయ్‌గఢ్‌లో 8,380 మందిని, రత్నగిరిలో 3,896 మంది, సింధుదుర్గ్‌లో 144 మందిని తరలించినట్లు చెప్పారు. ముంబై, థానే, పొరుగు ప్రాంతాల పరిస్థితిని సీఎం సమీక్షించారని, తుఫాను కారణంగా ఆయా ప్రాంతాల్లో కొవిడ్ రోగుల చికిత్సలపై ఎలాంటి ప్రభావం పడకుండా చూసుకోవాలని సీఎం ఆదేశించారని అధికారులు పేర్కొన్నారు. రాయ్‌గఢ్ జిల్లాలో రెడ్ అలర్ట్ జారీ కాగా.. ముంబై, థానే, పాల్ఘర్ జిల్లాలో ఆరెంజ్ అలర్ట్ జారీ అయ్యింది.
మరో వైపు డెప్యూటీ సీఎం అజిత్ పవార్ సైతం సచివాలయంలో సహాయక చర్యలపై ఆరా తీశారు. రాష్ట్రంలోని అన్ని తీర ప్రాంత జిల్లాల అధికారులను అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. తుఫాను నేపథ్యంలో సహాయక చర్యలు, సన్నాహాలపై పవార్ సింధుదుర్గ్, రాయ్‌గఢ్, థానే, పాల్ఘర్, ముంబై సిటీ, ముంబై శివారు, బృహన్ ముంబై మున్సిపల్ కమిషనర్లతో మాట్లాడారు. మరో వైపు తౌక్టే అతి తీవ్ర తుఫానుగా మారింది. సాయంత్రానికి తుఫాను గుజరాత్ తీరానికి చేరుకొని.. రాత్రి 8 నుంచి 11 గంటల మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. భారీ గాలులతో కురుస్తున్న వర్షానికి ముంబైలో పలు చెట్లు నేలకూలాయని, అయితే ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణనష్టం జరుగలేదని అధికారులు తెలిపారు.
ఇవి కూడా చదవండి..
ఆర్టీపీసీఆర్లో తేలకుంటే మరో టెస్టు
చేయని తప్పుకు శిక్ష.. 550 కోట్ల పరిహారం!
గుజరాత్లో భూకంపం
ఉస్మానాబాద్ జైలులో 133 మంది ఖైదీలకు కరోనా
విషాదం : హైదర్‌గూడలో అగ్ని ప్రమాదం.. ఒకరు సజీవ దహనం
తెరుచుకున్న కేదార్నాథ్ ఆలయం.. భక్తులకు నో ఎంట్రీ
జగన్నాథుడి దర్శనం.. జూన్ 15 వరకు బంద్
వచ్చే ఏడాది పార్లమెంట్ శీతాకాల సమావేశాలు కొత్త భవనంలోనే..!
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rains | బంగాళాఖాతంలో అల్ప పీడనం.. మూడు రోజులు వర్షాలు..!
Tiger Shroff | కళాకారులు సులభమైన టార్గెట్లు.. టైగర్ ష్రాఫ్ ఘటనపై స్పందించిన ‘ధురంధర్’ నటుడు!
Ranbir Kapoor | హైదరాబాద్‌కు రావడం ఎప్పుడూ ప్రత్యేకమే.. తెలుగులో మాట్లాడిన రణ్‌బీర్!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
China Restrictions | కీలక యంత్రాల ఎగుమతులపై చైనా కొత్త ఆంక్షలు
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

