Cyclone Akvan | దూసుకొస్తున్న తీవ్ర తుఫాను అక్వాన్.. శుక్రవారం తీరాన్ని దాటే ఛాన్స్..!
Cyclone Akvan | బంగాళాఖాతం (Bay of Bengal) లో ఏర్పడిన తీవ్ర తుఫాను అక్వాన్ (Cyclone Akvan) తీరంవైపు దూసుకొస్తున్నది. గడిచిని ఆరు గంటలుగా గంటకు ఐదు కిలోమీటర్ల వేగంతో తుఫాను కదులుతున్నదని భారత వాతావరణ కేంద్రం (IMD) వెల్లడించింది.
Cyclone Akvan : బంగాళాఖాతం (Bay of Bengal) లో ఏర్పడిన తీవ్ర తుఫాను అక్వాన్ (Cyclone Akvan) తీరంవైపు దూసుకొస్తున్నది. గడిచిని ఆరు గంటలుగా గంటకు ఐదు కిలోమీటర్ల వేగంతో తుఫాను కదులుతున్నదని భారత వాతావరణ కేంద్రం (IMD) వెల్లడించింది. ఈ తుఫాను పశ్చిమ-మధ్య బంగాళాఖాతంలో ఆంధ్రప్రదేశ్ (Andhrapradesh) లోని నర్సాపూర్‌కు ఆగ్నేయంగా 480 కిలోమీటర్లు, కళింగపట్నానికి దక్షిణ-ఆగ్నేయంగా 510 కిలోమీటర్లు, చెన్నైకి తూర్పున 560 కిలోమీటర్లు, ఒడిశాలోని గోపాల్‌పూర్‌కు దక్షిణంగా 600 కిలోమీటర్లు, పూరీకి దక్షిణంగా 660 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్నది.
అక్వాన్ తుఫాను ఉత్తర-వాయవ్య దిశగా కదులుతూ నవంబర్ 20న (శుక్రవారం) మధ్యాహ్నానికి నర్సాపూర్, పూరీల మధ్య ఉత్తర ఆంధ్రప్రదేశ్-యానాం, దక్షిణ ఒడిశా తీరాలను దాటే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. తుఫాను తీరం దాటే సమయంలో గంటకు 90-100 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, గరిష్టంగా గంటకు 110 కిలోమీటర్ల వేగంతో తుఫాను తీరాన్ని తాకుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
తీవ్ర తుఫాను అక్వాన్ తీరం దాటే అవకాశం ఉన్న నేపథ్యంలో ఒడిశా ప్రభుత్వం ప్రమాదకర ప్రాంతాల నుంచి సుమారు 50,000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించింది. తుఫాను సన్నద్ధత కోసం బుధవారం ఒడిశా సీఎం ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. తుఫాను తీరం దాటే సమయంలో ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ప్రాణనష్టం ఏమాత్రం జరగకూడదనేదే తమ లక్ష్యమని చెప్పారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bridge collapses | రెండు లారీలు వెళ్తుండగా కూలిన వంతెన.. ఒక లారీలో చెలరేగిన మంటలు
Road Accident | పల్నాడు జిల్లాలో రోడ్డుప్రమాదం.. ముగ్గురు మృతి
నల్లగొండ మున్సిపల్ కమిషనర్‌గా నర్రా శ్రీజరెడ్డి బాధ్యతల స్వీకరణ
Maatrubhumi | జీరో కట్స్‌తో సెన్సార్ పూర్తి చేసుకున్న సల్మాన్ ఖాన్ ‘మాతృభూమి’.. విడుదల ఎప్పుడంటే?
Mahesh Kumar Goud | కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాటలను పరిశీలిస్తాం : టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

