సిటీబ్యూరో, ఫిబ్రవరి 17 (నమస్తే తెలంగాణ): మ్యాట్రీమోని వెబ్‌సైట్‌తో పెండ్లి చేసుకుంటానంటూ ముందుకొచ్చిన సైబర్‌నేరగాడు.. ఢిల్లీ ఎయిర్‌పోర్టులో తనను కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారంటూ నమ్మించి ఓ వైద్యురాలికి రూ. 1.09 కోట్లు టోకరా వేశాడు. సైబర్ క్రైమ్ పోలీసుల వివరాల ప్రకారం.. బేగంపేట్‌లో నివాసముండే బాధితురాలు ప్రభుత్వ విభాగంలో వైద్యురాలిగా పనిచేస్తుంది. ఆమె షాదీ. కామ్(క్రిష్టియన్) మ్యాట్రీమోనీ సైట్లో ప్రొఫైల్‌ను అప్లోడ్ చేసింది. దీన్ని చూసిన విలియం సంగ్మా అమన్ పేరుతో సైబర్ నేరగాడు.. మీ ప్రొఫైల్ నచ్చిం ది.. పెండ్లి చేసుకోవడానికి ముందుకు వచ్చాడు. తన కూతురితో కలిసి ఉన్న ఫొటో, అంతర్జాతీయ డ్రైవింగ్ లైసెన్స్‌ను ఆమెకు షేర్ చేశాడు. గత ఏడాది నవంబర్ 14న వీళ్లిద్దరూ మాట్లాడుకున్నారు. కొన్ని రోజుల తర్వా త తాను ఇండియాకు వస్తున్నానని నేరుగా మీమ్ములను కలుస్తానంటూ విలియం నమ్మించాడు.
నవంబర్ 26న ఢిల్లీ ఎయిర్‌పోర్టు నుంచి అనిత అనే పేరుతో ఓ మహిళ.. వైద్యురాలికి ఫోన్ చేసి .. విలియం 1,55000 బ్రిటన్ పౌండ్లు అక్రమంగా ఇండియాకు తీసుకొస్తున్నాడని, ఇతనిపై మనీలాండరింగ్ కేసు నమోదయ్యిందంటూ వివరించింది. అతడిని విడుదల చేయాలంటే కొంత డబ్బు చెల్లించాలంటూ డిమాండ్ చేయడంతో బాధితురాలు మొదట రూ. 55వేలు, ఆ తరువాత రూ. 2.5 లక్షలు చెల్లించింది. ఆ తరువాత జీఎస్టీ, ఇతర సర్టిఫికేట్లు, మినిస్టిరీ ఆఫ్ ఫైనాన్స్ ఇండియా ఫండ్ ఇలా వివిధ సర్టిఫికేట్లు కావాలంటూ నమ్మిస్తూ మరింత డబ్బు వసూలు చేశా రు. అయితే మీరు సర్టిఫికేట్ల కోసం పెట్టే డబ్బు తిరి గి మీ ఖాతాలోకి డిపాజిట్ అవుతాయని అందుకు మీ ఆధార్, పాన్ కార్డు వివరాలు పంపించడం టూ సూచించగా బాధితురాలు అన్ని వివరాలు పంపించింది. ఇంతలోనే మరోసారి డీజీపీ, ఆర్బీఐ నుంచి కూడా ఆ డాక్యుమెంట్లపై సంతకాలు కావాలంటూ మరికొన్ని లక్షలు వసూలు చేసింది. మీరు డబ్బు చెల్లించకపోతే విలియం వద్ద ఉన్న పౌండ్లు, విలియం లోపలికి వెళ్తాడని, ఇప్పటి వర కు మీరు చెల్లించిన డబ్బు కూడా వృథా అవుతుందంటూ బెదిరించారు. ఇలా.. దఫ దఫాలుగా లక్షల రూపాయలు సైబర్‌నేరగాళ్లు సూచించిన బ్యాంకు ఖాతాలో డిపాజిట్ చేస్తూ వెళ్లింది.
నవంబర్ 26 నుంచి డిసెంబర్ 15 వరకు సైబర్ నేరగాళ్లు చెప్పిన విధంగా వైద్యురాలు డబ్బు డిపాజిట్ చేస్తూ వెళ్లింది. ఇంతలో విలియం సంగ్మా అమన్ .. ఆమెకు ఫోన్‌చేసి మనలను కొందరు మోసం చేశారని, ఎయిర్‌పోర్టు అథారిటీ అంటూ నమ్మించి నన్ను, నా కూతురును వేధించారని, కనీసం బట్టలు కూడా ఇవ్వకుండా నిర్బంధించారంటూ బాధితురాలితో ఫోన్లో తన ఆవేదన చెం దినట్లు నటించాడు. అయితే ఇప్పటి వరకు మనం చెల్లించిన డబ్బంతా వెనక్కి రాబట్టాలని, నేను మా నసికంగా కృంగిపోయానంటూ నమ్మించాడు. ఇం తలోనే ఇక్కడ ఆమెరికాకు చెందిన ఒక హ్యూమన్ యాక్టివిస్ట్(న్యాయవాది) ఉన్నాడని ఢిల్లీ కోర్టులో కేసు ఫైల్ చేసి డబ్బంతా తిరిగి రాబట్టిస్తానంటూ బాధితురాలికి చెప్పాడు. ఆ విషయాన్ని నమ్మిన బాధితురాలు న్యాయవాదిగా చెప్పుకునే అబ్ర హం.. ఆమెతో మాట్లాడాడు. అయితే తాము కేసు వేయడానికి కొంత డబ్బు కావాలంటూ అక్కడి నుంచి మరో గేమ్ ప్లే చేశారు. కోర్టు పేరుతో వారం రోజుల పాటు అందినకాడికి వసూలు చేశారు.
ఆ తరువాత డిసెంబర్ 22న మనం కోర్టులో కేసు గెలిచామని, మనకు రిఫండ్‌గా రూ.3 లక్షల డాలర్లు తిరిగి వస్తున్నాయంటూ నమ్మించాడు. అయితే అందుకు ఆర్బీఐకి కొంత డబ్బు చెల్లించాలంటూ తిరిగి వసూళ్ల పర్వం ప్రారంభించాడు. మీ పేరుపై ఆర్బీఐకి చెందిన డెబిట్‌కార్డును మీ సొంత ఊరు ఏపీలోని పులివెందులకు పంపించామంటూ సూ చించారు. అక్కడకు కొరియర్లో ఒక కార్డు వచ్చిం ది, అది కొటక్ మహేం ద్ర బ్యాంకు సంబంధించిన డెబిట్ కార్డు కావడంతో అందులోమూడు దఫాలుగా రూ. 12 వేలు డ్రా అయ్యాయి… పిన్ మా ర్చాలంటూ మెసేజ్ రావడంతో పిన్ మార్చేందుకు బాధితురాలు ప్రయత్నించింది.
పిన్ మారకపోవడంతో పాటు కార్డు నుంచి డబ్బు విత్ డ్రా చేసుకోవడానికి ప్రయత్నిస్తే డిక్లేన్ అని వచ్చింది. కార్డు పనిచేయడం లేదని ఆర్బీఐలో మరికొంత డబ్బు చెల్లించాలంటూ వసూలు చేశారు, ఆ తరువాత కార్డు యాక్టివేట్ అయ్యిందని 15 రోజుల్లో విత్ డ్రా చేసుకోవచ్చంటూ నమ్మించాడు. నేను ఆ ఖాతాలో రూ. 3.75 కోట్లు ఉన్నట్లు గుర్తించానని, ఇప్పుడే వాటిని విత్ డ్రా చేసుకోలేమని.. 15 రోజుల్లో వా టిని విత్ డ్రా చేసుకోచ్చంటూ నమ్మించారు. ఆ త రువాత కూడా బాధితురాలిని మాటల్లో పెట్టి డబ్బు వసూలు చేశా డు. అయితే ఎంతకు డబ్బు తిరిగి రాకపోవడంతో అనుమానం వచ్చిన బాధితురాలు ఈ విషయంపై ఆరా తీసి, ఇదంతా మోసమని గుర్తించి, మల్కాజిగిరి సైబర్‌క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు దర్యాప్తు చేపట్టారు.