దేశంలో కొవిడ్ పరిస్థితిపై కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నేడు చర్చ
కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ |

న్యూఢిల్లీ : దేశంలో కొవిడ్ పరిస్థితిని సమీక్షించేందుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ శనివారం వర్చువల్ విధానంలో భేటీకానుంది. ఈ సందర్భంగా వైరస్ అరికట్టేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై నేతలు చర్చించనున్నారు. అలాగే ఐదు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికలు, పార్టీ ఆర్థిక పరిస్థితిపై సమీక్ష నిర్వహించనున్నట్లు సమాచారం. ఈ సమావేశానికి కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ అధ్యక్షతన వహించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం దేశంలో రోజువారీ కేసులు లక్షల్లో నమోదువుతున్నాయి. దీన్ని పార్టీ తీవ్రంగా పరిగణిస్తోందని.. ఈ మేరకు పార్టీ కమిటీ అభిప్రాయాన్ని తీసుకొని, ఈ విషయంలో తీర్మానం ఆమోదించే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.
ఇదిలా ఉండగా ఇటీవల కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా జరుగుతున్న కొవిడ్ వ్యాక్సిన్ డ్రైవ్‌పై విమర్శలు గుప్పించింది. ఈ మేరకు ప్రధానికి సోనియా గాంధీ లేఖ రాసిన విషయం తెలిసిందే. ఇటీవల సైతం కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రుల మండలితో సమావేశమైన విషయం తెలిసిందే. సంక్షోభ సమయంలో రాష్ట్రాలు ప్రజల కోసం మరింత కృషి చేయాలని సూచించారు. ఈ సందర్భంగా టీకాల కొరత ఎదుర్కొంటున్న సీఎంలు సోనియా గాంధీకి విన్నవించారు.
ఆ సమావేశం తర్వాత సోనియా పీఎంకు లేఖ రాశారు. కరోనాతో నష్టపోతున్న పేదలందరికీ రూ.6 వేలు చొప్పున ఇవ్వాలని సోనియా తన లేఖలో డిమాండ్ చేశారు. వలస కార్మికుల ప్రయాణం మళ్ళీ ప్రారంభమైన నేపథ్యంలో చర్యలు చేపట్టాలని సూచించారు. దేశంలో కరోనా టీకాల కొరత లేకుండా అన్నీ రకాల చర్యలు తీసుకోవాలని చెప్పారు. వయసు ప్రాతిపదికనే కాకుండా అవసరం ఆధారంగా టీకా అందించాలని తెలిపారు. కొవిడ్‌ను ఎదుర్కోనేందుకు అవసరమైన అన్ని రకాల పరికరాలు, ఔషధాలు, మౌలిక వసతులను జీఎస్టీ నుంచి మినహాయించాలని సోనియా గాంధీ తన లేఖలో డిమాండ్ చేశారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
నాగార్జునసాగర్‌లో ప్రారంభమైన పోలింగ్
పిల్లలను తీర్చిదిద్దాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉంది
తమిళ నటుడు వివేక్ కన్నుమూత
బెంగాల్లో ఐదో దశ ఎన్నికల పోలింగ్ షురూ
అన్ని కేసులపై ఒకేసారి విచారణ
మరోసారి పవన్ ఫ్యాన్స్‌ను రెచ్చగొట్టిన వర్మ..!
గతేడాదిలాగే ఎస్సెస్సీ గ్రేడ్స్!
ఢిల్లీలో రెండురోజుల్లోనే 1200లకుపైగా కంటైన్మెంట్ జోన్లు
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
Diabetes | డయాబెటిస్తో పళ్లు ఊడిపోతాయా?.. ఈ 6 సమస్యలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి!
Dandari festival | దండారి ఉత్సవాలు భావితరాలకు అందించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలి : బీఆర్ఎస్ ఇన్చార్జి భూక్యా జాన్సన్ నాయక్
Kaaka | చిరంజీవి చేతిలో కొడవలి, రక్తంతో తడిసిన ఆయుధం.. ‘కాకా’ నుంచి ఊచకోత పోస్టర్
Gajulapeta Villagers | పట్టించుకోని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి.. బీటీ రోడ్డు రెన్యువల్ కోసం గాజులపేట గ్రామస్తుల పాదయాత్ర
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

