లేడీ సూపర్ స్టార్ నయనతార తన సినిమాల కన్నా కూడా ప్రేమాయణంతోనే ఎక్కువగా వార్తలలో నిలుస్తూ వస్తుంది. ఇప్పటికే రెండు బ్రేకప్‌లు చేసుకున్ననయన్ ప్రస్తుతం విఘ్నేష్ శివన్‌తో పీకల్లోతు ప్రేమలో ఉంది. ఇప్పటికే వీరిద్దరు ఎంగేజ్మెంట్ చేసుకోగా, త్వరలో పెళ్లి చేసుకునేందుకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో నయనతార చేతిలో ఓ పసిబిడ్డ కనిపించడం అందరికి పెద్ద షాకింగ్‌గా మారింది.
నయన తార- విఘ్నేష్ శివన్‌లు ఆరేళ్లుగా సహజీవనం చేస్తున్నారు.ఈ క్రమంలో పసిబిడ్డ ఇప్పుడు సస్పెన్స్ ఎలిమెంట్ గా మారింది. దీనిపై నెటిజన్స్‌తో పాటు అభిమానులు తెగ ఆరాలు తీస్తున్నారు. ప్రస్తుతం నయనతార తన ప్రియుడు విఘ్నేష్ శివన్ తెరకెక్కిస్తున్న కాతు వాకుల రేండు కాదల్ చిత్రంలో కథానాయికగా నటిస్తుంది.ఇందులో సమంత కూడా ముఖ్య పాత్ర పోషిస్తుంది. విజయ్ సేతుపతి కథానాయకుడిగా నటిస్తున్నారు.
నయన తార త్వరలో తెలుగులోను నటించనుందని తెలుస్తుంది. లూసీఫర్ రీమేక్ గాడ్ ఫాదర్ లో నయన్ కీలక పాత్రలో కనిపించనుంది. మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్నారు. ఎన్వీ ప్రసాద్ -చరణ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇందులో సత్యదేవ్ సరసన నయన్ కనిపించనున్నట్టు సమాచారం.