డెల్టా వేరియంట్‌పై వ్యాక్సిన్లు పనిచేస్తాయా? ఐసీఎంఆర్ అధ్యయనంలో ఏం తేలింది?
corona virus Delta | ప్రస్తుతం దేశంలో అందుబాటులో ఉన్న అన్ని వ్యాక్సిన్లు కొవిడ్-19 డెల్టా వేరియంట్‌పై సమర్థవంతంగా

న్యూఢిల్లీ : ప్రస్తుతం దేశంలో అందుబాటులో ఉన్న అన్ని వ్యాక్సిన్లు కొవిడ్-19 డెల్టా ( corona virus Delta ) వేరియంట్‌పై సమర్థవంతంగా పని చేస్తున్నాయి. ఈ మేరకు ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) నిర్వహించిన అధ్యయనంలో తేలింది. వివరాలను ఇండియన్ సార్స్-కోవ్-2 జెనోమిక్స్ కన్సార్టియం (INSACOG) కో చైర్మన్ డాక్టర్ ఎన్కే ఆరోరా తెలిపారు. ‘డెల్టా వేరియంట్‌కు వ్యతిరేకంగా వ్యాక్సిన్ల ప్రభావం’పై అడిగిన ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. టీకాలు వేరియంట్‌పై సమర్థవంతంగా పని చేస్తున్నాయని, ఐసీఎంఆర్ నిర్వహించిన అధ్యయనంలో తేలిందన్నారు. అయితే ఉత్తర, దక్షిణాధి రాష్ట్రాల్లో కొవిడ్ కేసుల్లో దేశం కరోనా పుంజుకుంటుందని, దీనికి డెల్టా వేరియంట్ కారణమన్నారు.

చాలా ప్రాంతాల్లో కేసుల సంఖ్య గణనీయంగా తగ్గినప్పటికీ కొన్ని ప్రాంతాలు.. ముఖ్యంగా ఈశాన్య, దక్షిణాది రాష్ట్రాల్లోని అనేక జిల్లాల్లో అధిక టెస్ట్ పాజిటివిటీ (టీపీఆర్) చూస్తున్నప్పటికీ.. ఎక్కువ భాగం డెల్టా వేరియంట్ కారణమై ఉండవచ్చన్నారు. థర్డ్ వేవ్‌పై స్పందిస్తూ.. ప్రస్తుతం సెకండ్ వేవ్ కొనసాగుతుందని, ఎక్కువ మంది ప్రజలకు టీకాలు వేస్తే భవిష్యత్‌లో వచ్చే వేవ్‌లను నియంత్రించవచ్చన్నారు. మహమ్మారిని నిర్మూలించేందుకు ప్రజలు తప్పనిసరిగా వ్యాక్సిన్లు తీసుకోవడంతో పాటు తప్పనిసరిగా కొవిడ్ మార్గదర్శకాలు పాటించడంపై దృష్టి పెట్టాలని సూచించారు. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం భారత్‌లో సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా కొవిషీల్డ్, భారత్ బయోటెక్ కొవాగ్జిన్, రష్యన్ స్పుత్నిక్-వీ వ్యాక్సిన్లకు అత్యవసర వినియోగానికి అనుమతి లభించిన విషయం తెలిసిందే.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

