విలీన గ్రామాలపై పన్నుల పిడుగు!
క్యూర్ చట్టంతో జీహెచ్ఎంసీలో విలీన శివారు ప్రజలకు ఆస్తి పన్నుల భారం పడనున్నది. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ఇప్పుడున్న ఆస్తిపన్నుల కంటే మూడు నుంచి నాలుగురేట్లు పెరుగుతుందన్న అభిప్రాయాలు అధికారుల నుంచి వినిపిస్తున్నాయి. జీహెచ్‌ంఎసీలో విలీన ప్రాంతాలకు ఇప్పటి వరకు పాత జీహెచ్ఎంసీ విధానంతోనే రిజిస్ట్రేషన్ పన్నులు, ఆస్తి పన్నులు వసూలు చేశారు.
మేడ్చల్, అక్టోబర్ 12 (నమస్తే తెలంగాణ): క్యూర్ చట్టంతో జీహెచ్ఎంసీలో విలీన శివారు ప్రజలకు ఆస్తి పన్నుల భారం పడనున్నది. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ఇప్పుడున్న ఆస్తిపన్నుల కంటే మూడు నుంచి నాలుగురేట్లు పెరుగుతుందన్న అభిప్రాయాలు అధికారుల నుంచి వినిపిస్తున్నాయి. జీహెచ్‌ంఎసీలో విలీన ప్రాంతాలకు ఇప్పటి వరకు పాత జీహెచ్ఎంసీ విధానంతోనే రిజిస్ట్రేషన్ పన్నులు, ఆస్తి పన్నులు వసూలు చేశారు. ఓఆర్ఆర్ లోపల ఉన్న మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో ఉన్న వివిధ మున్సిపాలిటీలను జీహెచ్‌ంఎసీలో విలీనం అనంతరం సీఎంసీ, ఎంఎంసీ కార్పొరేషన్లగా కాంగ్రెస్ ప్రభుత్వం మార్చిన విషయం విధితమే.
ఈ ప్రక్రియతో పాటు క్యూర్ చట్టం అమలుతో అనేక స్థాయిలో ఆస్తి పన్నులు పెరగనున్నాయి. ప్రభుత్వం భూముల రిజిస్ట్రేషన్ ధరలను పెంచినప్పుడల్లా ఆస్తి పన్ను పెరిగే అవకాశం ఉంటుందని అధికారుల ద్వారా తెలుస్తోంది. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని 13 మున్సిపాలిటీలు జీహెచ్ఎంసీలో విలీనమైన అభివృద్ధికి మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందన్న విమర్శలు వస్తున్నాయి. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా గతంలో పూర్తిగా గ్రామీణ ప్రాంతంగా ఉండేది.
అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం.. శివారు ప్రాంత అభివృద్ధికి జిల్లాలో 16 మున్సిపాలిటీలుగా ఏర్పాటు చేసి వేలాది కోట్ల రూపాయలను మంజూరు చేసింది. దీంతో శివారు ప్రాంతాలు అభివృద్ధి బాటపట్టగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మున్సిపాలిటీలను జీహెచ్ఎంసీ మొదట విలీనం చేసింది. ఆ తర్వాత సీఎంసీ, ఎంఎంసీలో విలీనం చేసింది. విలీనం చేసిన నాటి నుంచి విలీన ప్రాంతాల అభివృద్ధికి ఒక్క పైసా కేటాయించకపోవడంతో ఎంఎంసీ, సీఎంసీలో విలీనమైన ప్రాంతాలు అభివృద్ధికి దూరమయ్యాయి. ఇప్పుడు ఇప్పుడే మున్సిపల్ కార్పొరేషన్ల పాలనకు అలవాటు పడుతున్న క్రమంలో తాజా పరిణామాలతో శివారు ప్రాంతాలపై ఆర్థిక భారం పడనుంది. క్యూర్ చట్టంలో టౌన్ ప్లానింగ్ వైబ్ సైట్లు తెరుచుకుంటే పెరిగిన అస్తుపన్నుల వివరాలు బయటకు రానున్నాయి.
భూముల విలువ ఆధారంగా..
భూముల విలువ ఆధారంగా ఆస్తి పన్నుల పెంపు జరుగుతున్నట్లు ప్రచారం జరుగుతున్నది. జిల్లాలోని వివిధ ప్రాంతాలలో ప్రభుత్వం రిజిస్ట్రేషన్ వ్యాల్యు కనీసం రూ. 5 వేల నుంచి రూ. 15 ల వరకు ఉంది. దీంతో రిజిస్ట్రేషన్ వ్యాల్యు ప్రకారం ఆస్తి పన్నులు పెరిగితే నాలుగింతలు పెరిగితే మాత్రం భారీగా ఆర్థిక భారం ప్రజలకు తప్పదు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

