హాస్టల్ డిపాజిట్ పర్సనల్ ఖాతాలోకి!
విద్యార్థుల నుంచి వసూలు చేసిన హాస్టల్ డిపాజిట్ల వ్యవహారం జేఎన్టీయూ - మహబూబాబాద్ క్యాంపస్‌లో వివాదాస్పదంగా మారింది. ఈ క్యాంపస్‌లో పనిచేస్తున్న కొందరు డాటా ఎంట్రీ ఆపరేటర్లు, జూనియర్ అసిస్టెంట్లు విద్యార్థులు చెల్లించిన డిపాజిట్లను తమ సొంత ఖాతాల్లో వేసుకుంటున్నట్టు విద్యార్థులు ఆరోపిస్తున్నారు.
- మహబూబాబాద్ జేఎన్టీయూలో అక్రమాలు
- పర్సనల్ స్కానర్లు పెట్టి వసూలు
- ఫీజులు కట్టినా.. కట్టలేదని బుకాయింపు
- మళ్లీ చెల్లించాంటూ విద్యార్థులపై ఒత్తిడి
హైదరాబాద్, అక్టోబర్ 12 (నమస్తే తెలంగాణ) : విద్యార్థుల నుంచి వసూలు చేసిన హాస్టల్ డిపాజిట్ల వ్యవహారం జేఎన్టీయూ – మహబూబాబాద్ క్యాంపస్‌లో వివాదాస్పదంగా మారింది. ఈ క్యాంపస్‌లో పనిచేస్తున్న కొందరు డాటా ఎంట్రీ ఆపరేటర్లు, జూనియర్ అసిస్టెంట్లు విద్యార్థులు చెల్లించిన డిపాజిట్లను తమ సొంత ఖాతాల్లో వేసుకుంటున్నట్టు విద్యార్థులు ఆరోపిస్తున్నారు. విద్యార్థులు ఫీజులు కట్టే సమయంలో పర్సనల్ స్కానర్లు పెట్టిమరీ మళ్లించారని చెప్తున్నారు. హాస్టల్ అకౌంట్లో పడాల్సిన డబ్బులు వ్యక్తిగత ఖాతాల్లో జమ కావడం, విద్యార్థులు మళ్లీ చెల్లించాలని చెప్తుండడం వివాదానికి కారణమయ్యింది. సోమవారం విద్యార్థి సంఘాల నేతలు ప్రిన్సిపాల్‌ను కలిసి న్యాయ చేయాలని కోరారు. కొంతకాలం క్రితం జగిత్యాల క్యాంపస్‌లో ఇలాగే జరిగింది. రూ. 5 లక్షలకు పైగా దారి మళ్లించారు. దారి మళ్లించిన ఉద్యోగిపై అప్పట్లో వేటు వేశారు.
రెండేండ్లుగా డిపాజిట్ల్లు పక్కదారి
ఇంజినీరింగ్ అడ్మిషన్లు పొందిన విద్యార్థుల నుంచి హాస్టల్ కాషన్ డిపాజిట్లు వసూలు చేయడం అనవాయితీగా వస్తున్నది. అయితే ఈ కాలేజీలో పనిచేసే ఔట్సోర్సింగ్ ఉద్యోగులు కొందరు ఆన్లైన్లో డబ్బులు కట్టించుకుంటున్నారు. పర్సనల్ స్కానర్లు (ఫోన్‌పే) పెట్టి మరీ వేయించుకుంటున్నారు. కాలేజీ ఖాతాకు మాత్రం జమచేయలేదని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. రికార్డుల్లో ఫీజులు బకాయి ఉన్నట్టు చూపిస్తున్నారు. కాలేజీ అకౌంట్లకు కాకుండా కాలేజీ సిబ్బంది సూచించిన వ్యక్తిగత ఖాతాకు నగదు చెల్లించామని, ఇప్పటికే వేలకు వేలు చెల్లించిన తమను మళ్లీ కట్టాలని ఒత్తిడి తెస్తున్నారని విద్యార్థులు వాపోతున్నారు. కొత్తగా కాలేజీలో చేరిన తమకు సిబ్బంది వ్యక్తిగత ఖాతా, కాలేజీ అధికారిక ఖాతా మధ్య వ్యత్యాసం తెలియక మోసపోయామని విద్యార్థులు అంటున్నారు.
సాలర్షిప్ దరఖాస్తు కోసం బోనఫైడ్ సర్టిఫికెట్లు అవసరమని, అయితే డిపాజిట్ మొత్తాన్ని కాలేజీ ఖాతాలో చెల్లించిన తర్వాతే సర్టిఫికెట్లు జారీ చేస్తామని కాలేజీ అధికారులు చెప్తున్నారని అంటున్నారు. ఈ కాలేజీలోని కొందరు సిబ్బంది ఈ దందాను రెండేండ్లుగా నడిపిస్తున్నట్టు ఆరోపణలున్నాయి. ఒక్కో విద్యార్థి నుంచి ఐదు వేలు.. ఏడు వేలు కట్టించుకున్న ఉదంతాలు ఉన్నాయి. ఓ విద్యార్థి రూ.10 వేలు కట్టగా.. సిబ్బంది ఒకరు తన సొంత అకౌంట్లో వేసుకున్నాడు. నిరుడు ఔట్సోర్సింగ్ ఉద్యోగి ఒకరు రూ. 80 వేలు ఇలాగే సొంత అకౌంట్లో వేయించుకోవడం వివాదాస్పదమయ్యింది. విద్యార్థులు గట్టిగా నిలదీయడంతో ఆ ఉద్యోగి నుంచి రూ. 83వేలు రికవరీ చేశారు. విద్యార్థులు ఈ విషయంపై కళాశాల ప్రిన్సిపాల్‌ను ఫోన్లో ఆరా తీసేందుకు ప్రయత్నించగా, ఆయన స్పందించలేదు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

