
మేషం
అనుకున్న సమయంలో పనులు పూర్తవుతాయి. పాత బాకీలు వసూలు అవుతాయి. వ్యాపార అభివృద్ధికి ప్రయత్నిస్తారు. ఉద్యోగులకు పనిభారం పెరుగుతుంది. అధికారుల ఆదరణ పెరుగుతుంది. నలుగురిలో గౌరవ మర్యాదలు పొందుతారు. వివాహాది శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. చిన్నాచితకా ఆర్థిక సమస్యలు ఉన్నప్పటికీ నెగ్గుకువస్తారు. భూముల కొనుగోలు, వాహనాల విషయంలో జాగ్రత్తలు పాటించండి. వ్యాపార భాగస్వాముల మధ్య అవగాహన పెరుగుతుంది. విద్యార్థులకు మంచి సమయం. పై చదువుల ప్రయత్నాలు ఫలిస్తాయి. రాజకీయ, ప్రభుత్వ పనులు కలిసివస్తాయి. అనవసరమైన ఖర్చులు రావచ్చు.
వృషభం
ఇంట్లో పెద్దల సహకారం లభిస్తుంది. కళాకారులకు మంచి సమయం. ఆదాయం పెరుగుతుంది. కొత్త పనులు ప్రారంభించడానికి అనుకూల సమయం కాదు. గతంలో ప్రారంభించిన వాటిని పూర్తి చేయడం మంచిది. విద్యార్థులకు అనుకూలం. ఉద్యోగ ప్రయత్నాలలో జాప్యం జరుగుతుంది. సహోద్యోగులతో మనస్పర్ధలు రావచ్చు. అధికారుల ప్రోత్సాహం వల్ల పనులు ముందుకు సాగుతాయి. వాహనం, భూముల వల్ల ఖర్చులు పెరగవచ్చు. నియంత్రణ అవసరం. ఓపిక చాలా అవసరం. నిలిచిపోయిన పనుల్లో కదలిక వస్తుంది. కోర్టు వ్యవహారాలు అనుకూలిస్తాయి. వ్యాపార భాగస్వాముల మధ్య అవగాహన పెరుగుతుంది. వ్యవసాయదారులకు, పారిశ్రామికవేత్తలకు సంతృప్తికరం.
మిథునం
ప్రారంభించిన పనులు నిర్ణీత సమయంలో పూర్తవుతాయి. బరువుబాధ్యతలు పెరుగుతాయి. కుటుంబ సహకారం లభిస్తుంది. కొత్త ఉద్యోగంలో చేరే అవకాశం ఉంది. ఉద్యోగులకు ఉన్నతాధికారుల మద్దతు లభిస్తుంది. ఆర్థిక విషయాల్లో జాగ్రత్త అవసరం. వృథా ఖర్చులు పెరుగవచ్చు. ఇంట్లో అనుకూల వాతావరణం ఉంటుంది. వ్యాపార ఒప్పందాలు అనుకూలిస్తాయి. కోర్టు కేసులలో విజయం లభిస్తుంది. వ్యవసాయదారులకు, పారిశ్రామికవేత్తలకు అనుకూలం. వివాహాది శుభకార్య ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఉత్సాహంతో ఉంటూ, పనులపై మనసు నిలుపుతారు. కళాకారులకు మంచి అవకాశాలు వస్తాయి. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు.
కర్కాటకం
ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. పని ఒత్తిడి ఉంటుంది. సాధారణ పనులు పూర్తి చేయడానికి కూడా ఎక్కువ కష్టపడాల్సి రావచ్చు. స్నేహితులు, బంధువుల సహకారం లభిస్తుంది. అప్పుగా ఇచ్చిన సొమ్ము తిరిగి రావడానికి ఆలస్యం అవుతుంది. కోర్టు కేసులలో అనుకూల ఫలితాలు ఉంటాయి. వ్యాపారం లాభసాటిగా కొనసాగుతుంది. ఉద్యోగులకు తోటివారి సహకారం లభిస్తుంది. వివాదాలకు దూరంగా ఉండండి. పనులపై మనసు నిలపండి. ఆస్తి తగాదాలు పరిష్కారం అవుతాయి. కొత్త వస్తువులు కొంటారు. అనుకోని ఖర్చులతో కొన్ని ఇబ్బందులు ఏర్పడవచ్చు.
సింహం
ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తవుతాయి. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. కొత్త కొలువులో చేరే అవకాశం ఉంది. పట్టుదలతో పనులు పూర్తి చేసి అధికారుల మెప్పు పొందుతారు. రాజకీయంగా ప్రోత్సాహం లభిస్తుంది. కుటుంబంతో సంతృప్తిగా ఉంటారు. స్నేహితులతో ఉల్లాసంగా కాలం గడుపుతారు. ఆరోగ్యంపై శ్రద్ధ నిలుపుతారు. నిలిచిపోయిన పనులలో కదలిక వస్తుంది. కళాకారులకు మంచి అవకాశాలు వస్తాయి. ఆదాయం స్థిరంగా ఉంటుంది. వ్యాపార భాగస్వాముల మధ్య అవగాహన పెరుగుతుంది. విద్యార్థుల ఉన్నత విద్యా ప్రయత్నాలు ఫలిస్తాయి. సమయానికి తగ్గట్టు నిర్ణయాలు తీసుకుంటారు.
కన్య
ఆరోగ్యంపై శ్రద్ధ నిలుపుతారు. వ్యాపారం లాభసాటిగా సాగుతుంది. సంగీత, సాహిత్య రంగాలవారికి మంచి అవకాశాలు వస్తాయి. ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. స్నేహితులు, బంధువులతో అనుబంధం పెరుగుతుంది. వాహనంతో పనులు నెరవేరుతాయి. భూములు కొనుగోలు చేస్తారు. రావలసిన సొమ్ము అందుతుంది. తొందరపాటు నిర్ణయాల వల్ల చికాకులు తలెత్తవచ్చు. సంయమనం అవసరం. ఆరోగ్యంపై శ్రద్ధ నిలుపుతారు. వ్యాపారం సజావుగా సాగుతుంది. కొత్త పనులు చేపడతారు. తీర్థయాత్రలు చేస్తారు. వ్యవసాయదారులకు కలిసివస్తుంది. వాతావరణం, ఉత్పత్తి సంతోషకరంగా ఉంటుంది. పారిశ్రామికవేత్తలకు అందరి సహకారం లభిస్తుంది.
తుల
శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలకు హాజరవుతారు. కళాకారులకు సంతృప్తికరం. మంచి ఆదరణ లభిస్తుంది. ఆదాయం పెరుగుతుంది. ఆర్థిక సమస్యల మూలంగా కొన్ని పనులలో జాప్యం జరుగవచ్చు. అవసరానికి డబ్బు అందుతుంది. సమయస్ఫూర్తితో నిర్ణయాలు తీసుకుంటారు. కొత్త వ్యాపారం ఆరంభించే ప్రయత్నాలు చేస్తారు. వివాదాలకు దూరంగా ఉండండి. ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. గృహ నిర్మాణ కార్యక్రమాలు చేపడతారు. కోర్టు కేసులలో ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. ఉద్యోగులకు తోటివారితో చిన్నపాటి అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు.
వృశ్చికం
ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. పనులు పూర్తి కావడంలో కొంత జాప్యం జరగవచ్చు. కుటుంబ పెద్దల సహకారం లభిస్తుంది. సంగీత, సాహిత్య, నాటక కళాకారులకు సమాజంలో గుర్తింపు పెరుగుతుంది. కొత్త అవకాశాలతో ఆదాయం పెరుగుతుంది. ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొంటారు. పట్టుదల, ఏకాగ్రత అవసరం. కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. గత పెట్టుబడుల వల్ల ఆదాయం లభిస్తుంది. భూముల విషయంలో వివాదాలు కొంత వరకు పరిష్కారం అవుతాయి. వ్యవసాయదారులకు, పారిశ్రామికవేత్తలకు అనుకూల సమయం. సహోద్యోగులతో, ఉన్నతాధికారులతో సఖ్యత చెడుతుంది.
ధనుస్సు
ఇంట్లో అనుకూల వాతావరణం ఉంటుంది. ఆదాయం పెరుగుతుంది. కుటుంబ పెద్దల సూచనలను పాటించి సత్ఫలితాలను పొందుతారు. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. రోజువారీ కార్యకలాపాలు నిరాటంకంగా కొనసాగుతాయి. విద్యార్థులు శ్రమించాల్సి వస్తుంది. పై చదువుల కోసం చేసే ప్రయత్నాలు సఫలం అవుతాయి. ఉద్యోగ ప్రయత్నాలలో ఊరట లభిస్తుంది. పట్టుదలతో అనుకున్న సమయంలో పనులు పూర్తిచేస్తారు. ఆదాయంలో హెచ్చుతగ్గులు ఉంటాయి. కొత్త దుస్తులు, వస్తువులు కొంటారు. బంధుమిత్రులను కలుసుకుంటారు. వ్యాపారులకు భాగస్వాములతో అవగాహన పెరుగుతుంది. కొత్త ఒప్పందాలు చేసుకుంటారు.
మకరం
ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. సమయస్ఫూర్తితో వ్యవహరిస్తారు. అధికారుల ఆదరణ లభిస్తుంది. పదోన్నతి, స్థానచలన సూచనలు ఉన్నాయి. శుభకార్య ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రభుత్వ పనులలో కార్యసాఫల్యం ఉంటుంది. బంధుమిత్రుల రాకతో సంతృప్తిగా ఉంటారు. అయితే ఖర్చులు పెరగవచ్చు. భూములు కొనుగోలు చేస్తారు. దూర ప్రయాణాలు, విహారయాత్రలు చేయవచ్చు. సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపార విస్తరణపై మనసు నిలుపుతారు. స్థిర, చరాస్తుల తగాదాలు పరిష్కారం అవుతాయి. పెద్దల సహకారం లభిస్తుంది. కళాకారులకు ఈ వారం ప్రోత్సాహకరంగా ఉంటుంది. వివాదాలకు దూరంగా ఉంటారు. ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి.
కుంభం
వ్యాపార భాగస్వాముల మధ్య అవగాహన పెరుగుతుంది. కొత్త ఒప్పందాలు, లావాదేవీల మూలంగా వ్యాపారం పెరుగుతుంది. ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొంటారు. పెద్దల సహకారం లభిస్తుంది. ఇంటా, బయటా సంతోషంగా ఉంటారు. కుటుంబ సభ్యులతో చర్చించి, సమయానుకూల నిర్ణయాలు తీసుకుంటారు. ఆదాయం స్థిరంగా ఉంటూ, నిదానంగా పెరుగుతుంది. పనులపై మనసు నిలుపుతారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలించి కొత్త ఉద్యోగంలో చేరే అవకాశం ఉంది. అధికారులతో స్నేహంగా ఉంటారు. బంధువుల సహకారం లభిస్తుంది. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ప్రయాణాల మూలంగా పనులు నెరవేరుతాయి. కోర్టు వ్యవహారంలో అనుకూల ఫలితాలు ఉంటాయి.
మీనం
వివాహాది శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. ఆత్మీయులు, స్నేహితుల సహకారంతో చాలా పనులు నెరవేరుతాయి. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. భూముల వ్యవహారం కలిసి వస్తుంది. శ్రమ పెరిగినా తగిన ప్రతిఫలాన్ని పొందుతారు. కళాకారులకు సమాజంలో గుర్తింపు లభిస్తుంది. ఆదాయం పెరుగుతుంది. ఇంట్లో అనుకూల వాతావరణం ఉంటుంది. తీర్థయాత్రలు, విహారయాత్రలు చేస్తారు. సమాజంలో గుర్తింపు పొందిన వారితో పరిచయాలు ఏర్పడతాయి. స్థిర, చరాస్తుల విషయంలో తగాదాలు పరిష్కారం అవుతాయి. మానసికంగా, శారీరకంగా సంతోషంగా ఉంటారు.
గుడి ఉమా మహేశ్వరశర్మ సిద్ధాంతి
ఎం.ఎస్సీ., నిర్మల పంచాంగకర్త
నల్లకుంట, హైదరాబాద్., సెల్: 9885096295
ఈ మెయిల్ : nirmalsiddhanthi@yahoo.co.in