పెరిగిన నూనె, పప్పు గింజల సాగు
- మూడేసి లక్షల ఎకరాలు దాటిన పల్లి, శనగ

హైదరాబాద్, డిసెంబర్ 29 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఈ యాసంగి సీజన్లో పప్పు, నూనె గింజల పంటలసాగు విస్తీర్ణం పెరుగుతున్నది. బుధవారం వరకు రాష్ట్ర వ్యాప్తంగా 11.65 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగైనట్టు వ్యవసాయశాఖ వెల్లడించింది. ఇందులో వేరుశనగ 3.06 లక్షల ఎకరాల్లో, శనగ 3.14 లక్షల ఎకరాల్లో సాగైనట్టు తెలిపింది. మొత్తంగా పప్పు పంటలు గతేడాది ఇదే సమయానికి 3.10 లక్షల ఎకరాల్లో సాగు కాగా ప్రస్తుతం 4.01 లక్షల ఎకరాల్లో సాగైనట్టు పేర్కొన్నది. నూనె గింజల సాగు గతేడాది ఇదే సమయానికి 2.03 లక్షల ఎకరాలు కాగా ప్రస్తుతం 3.46 లక్షల ఎకరాల్లో సాగైనట్టు వివరించింది. వరి సాగు విస్తీర్ణం గతేడాది ఇదే సమయానికి 3.07 లక్షల ఎకరాలు కాగా ప్రస్తుతం 1.18 లక్షల ఎకరాల్లో సాగవుతున్నట్టు వెల్లడించింది.

Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

