ICSI | సీఎస్ఈఈటీ జూన్ 2026 ఫలితాలను జూలై 15 మధ్యాహ్నం 2 గంటలకు విడుదల చేయనున్నట్లు ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఇండియా (ICSI) సోమవారం ప్రకటించింది. కంపెనీ సెక్రటరీ ఎగ్జిక్యూటివ్ ఎంట్రన్స్ టెస్ట్ (CSEET) రాసిన అభ్యర్థులు వెబ్సైట్ icsi.edu ను లాగిన్ అయి తమ ఫలితాలను చూసుకోవచ్చు.
అభ్యర్థులు తమ సబ్జెక్టుల వారీగా వచ్చిన మార్కులు, ఈ-రిజల్ట్-కమ్-మార్క్స్ స్టేట్మెంట్ను కూడా పొందవచ్చు. పరీక్షలో ఉత్తీర్ణత సాధించడానికి అభ్యర్థులు ఐసీఎస్ఐ నిర్దేశించిన కనీస అర్హత ప్రమాణాలను పాటించాలి. సీఎస్ఈఈటీ జూన్ 2026 ఫలితాల్లో ఉత్తీర్ణత హోదాను పొందడానికి అభ్యర్థులు ప్రతి పేపర్లో కనీసం 40 శాతం మార్కులు, మొత్తమ్మీద కనీసం 50 శాతం మార్కులు సాధించాలి.
ఈ పరీక్షల ఉత్తీర్ణులైన అభ్యర్థులు కంపెనీ సెక్రటరీ కోర్సులో తదుపరి దశ అయిన సీఎస్ ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్లో నమోదు చేసుకోవడానికి అర్హులవుతారు. ఐసీఎస్ఐ మార్క్షీట్లను జారీ చేయదు. కాబట్టి భవిష్యత్తులో అడ్మిషన్, ధ్రువీకరణ ప్రయోజనాల కోసం ఆన్లైన్ పత్రాన్ని భద్రంగా ఉంచుకోవాలి.