వాజేడు, మే 5: సీఆర్పీఎఫ్ ఎస్సై ఆత్మహత్య చేసుకొన్న ఘటన గురువారం ములుగు జిల్లా వాజేడులో చోటుచేసుకొన్నది. వాజేడు ఎస్సై కొప్పుల తిరుపతిరావు తెలిపిన వివరాల ప్రకారం.. 39వ బెటాలియన్ సీ కంపెనీకి చెందిన ఎస్సై జడ్ఎల్ ఠాక్రే (56) వాజేడు పోలీసు స్టేషన్లో సీఆర్పీఎఫ్ క్యాంపులో పనిచేస్తున్నారు. ఆయన స్వగ్రామం మహారాష్ట్రలోని గోండియా జిల్లా జల్లుట్ల గ్రామం. అతనికి భార్య లలిత, కుమారుడు రహిల్ ఠాక్రే ఉన్నారు. ఠాక్రే మూడేండ్లుగా ఇక్కడ పనిచేస్తున్నాడు. వ్యక్తిగత కారణాలతో గురువారం ఉదయం ఆయన ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఏటూరునాగారం ప్రభుత్వ వైద్యశాలలో పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం మృతదేహాన్ని ఆయన స్వగ్రామానికి తరలించినట్టు ఎస్సై తిరుపతిరావు తెలిపారు.