అనుపమ పరమేశ్వరన్, తరుణ్‌భాస్కర్, నరేష్ వీకే, అఖిల్ ఉడ్డెమారి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘క్రేజీ కల్యాణం’. తెలంగాణ పెళ్లి నేపథ్యంలో కుటుంబ కథగా తెరకెక్కిస్తున్నారు. భద్రప్ప గాజుల దర్శకుడు. బూసం జగన్మోహన్ రెడ్డి నిర్మిస్తున్నారు.
ఈ చిత్రాన్ని ముందుగా ప్రకటించినట్లుగా ఈ నెల 30వ తేదీన కాకుండా రెండు వారాల ముందుగా..అంటే ఈ నెల 16న విడుదల చేయబోతున్నామని మేకర్స్ తెలిపారు. ‘ప్రేమ, పెళ్లి, కుటుంబ అనుబంధాల నేపథ్యంలో నడిచే కథ ఇది. తెలంగాణలోని పెళ్లి జోష్ని ఆవిష్కరిస్తూ ఆద్యంతం వినోదాత్మకంగా సాగుతుంది’ అని మేకర్స్ తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: శ్యామ్ దూపాటి, కథ, స్క్రీన్‌ప్లే, సంభాషణలు, దర్శకత్వం: భద్రప్ప గాజుల.