రాష్ట్ర సమస్యలపై అమిత్ షా స్పందనేది?
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగ స్ఫూర్తికి, ప్రజాస్వామ్య విధానాలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ అక్రమ పద్ధతుల్లో మరోసారి అధికారంలోకి రావడానికి కుట్ర చేస్తున్నదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ విమర్శించారు.
- సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ విమర్శ
హైదరాబాద్, నవంబర్ 3 (నమస్తే తెలంగాణ): కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగ స్ఫూర్తికి, ప్రజాస్వామ్య విధానాలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ అక్రమ పద్ధతుల్లో మరోసారి అధికారంలోకి రావడానికి కుట్ర చేస్తున్నదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ విమర్శించారు. హైదరాబాద్లో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దేశంలో 13 కోట్ల ఓట్లను, తెలంగాణలో 93 లక్షల ఓట్లను తొలగించడానికి బీజేపీ కుట్ర పన్నిందని ఆరోపించారు.
ఢిల్లీ జంతర్ మంతర్లో నిరసన తెలిపిన వారిని, జాతీయ జెండా ఎగురవేసిన వారిని జైళ్లకు పంపడంవంటి ఘటనలను హోం మంత్రి సమర్థించుకోవడం రాజ్యాంగ స్ఫూర్తికే పెద్ద ప్రమాదం అని ఆందోళన వ్యక్తంచేశారు. ఈ కుట్రలను సీపీఎం తెలంగాణ రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండిస్తున్నదని చెప్పారు. హైదరాబాద్ పర్యటనకు వచ్చిన అమిత్ షా రాష్ట్రం ఎదురొంటున్న తీవ్ర కరువు, పెండింగ్ ప్రాజెక్టులు, కేంద్ర నిధులపై ఎటువంటి ప్రకటన చేయకుండా కేవలం రాజకీయ విమర్శలకే పరిమితమయ్యారని ఆగ్రహం వ్యక్తంచేశారు. కరువు బారిన పడిన తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం తక్షణమే రూ.50 వేల కోట్లు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

