సమయం కూడా ముఖ్యమే..
గుండె ఆరోగ్యంలో ‘నిద్ర’ కీలకపాత్ర పోషిస్తుంది. అయితే, ‘ఎంతసేపు నిద్రపోతున్నాం?’ అనే దానితోపాటు ‘ఏ సమయంలో నిద్రపోతున్నాం?’ అనేది కూడా ముఖ్యమేనని వైద్య నిపుణులు చెబుతున్నారు.
గుండె ఆరోగ్యంలో ‘నిద్ర’ కీలకపాత్ర పోషిస్తుంది. అయితే, ‘ఎంతసేపు నిద్రపోతున్నాం?’ అనే దానితోపాటు ‘ఏ సమయంలో నిద్రపోతున్నాం?’ అనేది కూడా ముఖ్యమేనని వైద్య నిపుణులు చెబుతున్నారు. తినే ఆహారం, చేసే వ్యాయామంతోపాటు నిద్రా సమయం కూడా గుండెను రక్షించడంలో ముఖ్యపాత్ర పోషిస్తుందని అంటున్నారు. అంతేకాకుండా, మధ్య వయసులో ఉన్నప్పుడు నిద్రవేళల్లో హెచ్చుతగ్గులు ఉండటం వల్ల భవిష్యత్తులో తీవ్రమైన గుండె సమస్యలకు దారితీసే అవకాశం ఉందని ఇటీవలి అధ్యయనాలు కూడా వెల్లడిస్తున్నాయి.
ఎనిమిది గంటలకంటే తక్కువ సమయం నిద్రపోయే వారిలో, క్రమరహితమైన నిద్రవేళలు ఉన్నవారికి రాబోయే దశాబ్ద కాలంలో తీవ్రమైన గుండె సంబంధిత సమస్యలు వచ్చే ప్రమాదం రెండింతలు ఎక్కువగా ఉన్నట్లు తేల్చాయి. నిజానికి మన శరీరం అంతర్గతంగా సర్కాడియన్ రిథమ్ ప్రకారం పనిచేస్తుంది. ఇది గుండె వేగం, రక్తపోటు, జీవక్రియ వంటి వాటిని నియంత్రించడంలో సహాయపడుతుంది. తరచూ నిద్రపోయే సమయాన్ని మారుస్తూ ఉండటం వల్ల.. ఈ సహజ లయ దెబ్బతింటుంది. ఇది కాలక్రమేణా గుండె నాళాల వ్యవస్థపై అదనపు భారాన్ని మోపుతుంది.
ఇక, పడుకునే ముందు స్క్రీన్ టైమ్ పెరగడం, కెఫిన్ తీసుకోవడం, రాత్రివేళ ఆలస్యంగా భోజనం చేయడం, ఆల్కాహాల్ తీసుకోవడం లాంటివి నిద్రలేమిని పెంచిపోషిస్తున్నాయి. నిరంతరంగా నిద్ర వేళలు మారుతుండటం కూడా గుండె ఆరోగ్యానికి చేటు తెస్తుంది. నిద్రలో గురక రావడం, శ్వాస నిలిచిపోవడం లాంటి సమస్యలు ఉన్నవారికి ఇది మరింత ప్రమాదకరంగా మారుతుంది. నిద్రలో శ్వాస అస్తవ్యస్తంగా మారడం వల్ల శరీరంలో ఆక్సిజన్ స్థాయులు తగ్గి, గుండెపై ఒత్తిడి పడుతుంది. బిగ్గరగా గురక పెట్టడం, నిద్రలో శ్వాస ఆగిపోవడం, ఉదయం తలనొప్పి, పగటిపూట విపరీతమైన మగత వంటి లక్షణాలు ఉంటే ఏమాత్రం నిర్లక్ష్యం చేయొద్దని నిపుణులు అంటున్నారు. గుండెను కాపాడుకోవడానికి ఆరోగ్యకరమైన నిద్ర అలవాట్లు పాటించాలని సూచిస్తున్నారు.
- వారాంతాల్లోనూ ఒకే రకమైన నిద్రవేళలను పాటించాలి.
- పడుకునే ముందు మొబైల్స్, టీవీ చూడటం తగ్గించాలి.
- రాత్రి పడుకునే ముందు కాఫీ, టీ వంటి కెఫిన్ పదార్థాలకు దూరంగా ఉండాలి.
- రాత్రిపూట ఆలస్యంగా, భారీ భోజనం చేయొద్దు.
- పడకగదిని నిశ్శబ్దంగా, చీకటిగా ఉంచుకోవాలి.
- ధ్యానం, శ్వాస వ్యాయామాలతో మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి.
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

