మహిళా సభ్యురాలి నగ్న వీడియోను సర్క్యులేట్ చేసిన సీపీఎం కార్యకర్త అరెస్ట్

తిరువనంతపురం : తనతో పాటు పనిచేసే మహిళా కార్యకర్త నగ్న వీడియోను ఆన్లైన్లో వ్యాప్తి చేసిన సీపీఎం సభ్యుడు ఎలిమన్నిల్ సజి (39)ని కేరళ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనకు సంంబంధించి ఐటీ చట్టం కింద సజీతో పాటు 12 మంది నిందితులపై పోలీసులు కేసు నమోదు చేశారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం తిరువల్ల సీపీఎం శాక కార్యదర్శి సీసీ సజిమోన్, డీవైఎఫ్ఐ నేత నాజర్ మహిళను మభ్యపెట్టి నగ్న వీడియోలు తీశారు. ఈ ఏడాది మేలో ఘటన జరగ్గా ఆపై ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రధాన నిందితులిద్దరూ మహిళను కారులో తీసుకువెళ్లి నేరానికి పాల్పడ్డారు.
బాధితురాలికి మత్తుమందు కలిపిన కూల్ డ్రింక్స్ ఇచ్చి ఆమెను లైంగికంగా వేధించడంతో పాటు నగ్న వీడియోలను చిత్రీకరించారు. తమకు రూ 2 లక్షలు ఇవ్వాలని లేకుంటే అభ్యంతరకర వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తామని హెచ్చరించారు. సజి మినహా ఈ కేసులో మిగిలిన నిందితులందరూ పరారీలోఉన్నారని వారిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నామని పోలీసులు తెలిపారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

