కరువు చర్యలపై కేంద్రం నిర్లక్ష్యం
రాష్ట్రంలో కరువు పరిస్థితులు తీవ్రరూపం దాల్చాయని, రైతు లు సంక్షోభంలో చికుకున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు.
- 10న కలెక్టరేట్ల ఎదుట సీపీఐ, రైతు సంఘం ధర్నాలు
- సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని
హైదరాబాద్, నవంబర్ 4 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కరువు పరిస్థితులు తీవ్రరూపం దాల్చాయని, రైతు లు సంక్షోభంలో చికుకున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. కరువు అంచనాలు, సహాయక చర్యల విషయంలో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం అఖిలపక్ష పార్టీలను కేంద్రం వద్దకు తీసుకెళ్లాలని డిమాండ్ చేశారు.
బుధవారం మఖ్దూంభవన్‌లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వ్యవసాయ కూలీలు, పేద కుటుంబాలను ఆదుకునే సమగ్ర సహాయక ప్యాకేజీ ప్రకటించాలని డిమాండ్ చేశారు. వరి పంటకు ఎకరాకు రూ.30 వేలు, పత్తి సహా ఇతర వాణిజ్య పంటలకు ఎకరాకు రూ.50 వేల చొప్పున పరిహారం చెల్లించాలని అన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతు ఇవ్వనున్నట్టు తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

