ఫ్లోరోసిస్ నివారణలో ‘మిషన్ భగీరథ’ కీలకపాత్ర
మిషన్ భగీరథ పథకం ద్వారా ఇంటింటికీ రక్షిత తాగునీరు అందడంతో నల్లగొండ జిల్లా నాంపల్లి మండలం రాందాస్ తండాలో ఫ్లోరోసిస్ సమస్య గణనీయంగా తగ్గిందని జాతీయ మానవ హకుల కమిషన్ స్పెషల్ మానిటర్ డాక్టర్ అనిమేశ్ భట్టాచార్య తెలిపారు.
- పదేండ్లలో ఒక ఫ్లోరోసిస్ కేసూ నమోదు కాలేదు
- జాతీయ మానవ హకుల కమిషన్ స్పెషల్ మానిటర్ డాక్టర్ అనిమేశ్ భట్టాచార్య
- మిషన్ భగీరథ పథకం అమలుపై ప్రశంసలు
నాంపల్లి, నవంబర్ 4: మిషన్ భగీరథ పథకం ద్వారా ఇంటింటికీ రక్షిత తాగునీరు అందడంతో నల్లగొండ జిల్లా నాంపల్లి మండలం రాందాస్ తండాలో ఫ్లోరోసిస్ సమస్య గణనీయంగా తగ్గిందని జాతీయ మానవ హకుల కమిషన్ స్పెషల్ మానిటర్ డాక్టర్ అనిమేశ్ భట్టాచార్య తెలిపారు. గత పదేండ్లుగా గ్రామం లో ఒక ఫ్లోరోసిస్ కేసు కూడా నమోదు కాలేదని అధికారులు వెల్లడించడంపై సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించడం ద్వారా ఆరోగ్య సమస్యలను నివారించవచ్చని, మిషన్ భగీరథ మంచి కార్యక్రమమని ప్రశంసించారు. బుధవారం ఆయన రాందాస్తండాను సందర్శించి మిషన్ భగీరథ తాగునీటి సరఫరాపై గ్రామస్తుల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నా రు.
గ్రామస్తుడు మెగావత్ అంతిరాం ఇంటికి వెళ్లి నల్లా నీటి సరఫరా గురించి వివరాలు తెలుసుకున్నారు. మిషన్ భగీరథ పథకం రాకముందు బోరు నీటిపైనే ఆధారపడేవారమని, ఫ్లోరైడ్ నీటి వినియోగంవల్ల అనేక ఆరోగ్య సమస్యలు ఎదురొన్నామని గ్రామస్తులు వివరించారు. రక్షిత తాగునీరు అందుబాటులోకి రావడంతో ఫ్లోరోసిస్ సమస్య తగ్గిందని సర్పంచ్ మెగావత్ చిట్టి శ్రీనివాస్ తెలిపారు. రెండు రోజులకోసారి నీరు సరఫరా అవుతున్నదని, ట్యాంకుల్లో నిల్వ చేసుకుని అవసరాలకు వినియోగించుకుంటున్నామని గ్రామస్తులు వెల్లడించా రు. గ్రామంలో ప్రస్తుతం ఫ్లోరోసిస్ కేసు లు లేవని ఆశ కార్యకర్త వెల్లడించగా, గత పదేండ్లుగా ఒక కేసు కూడా నమోదు కాలేదని మండల అధికారులు వివరించారు. గ్రామంలోని మొత్తం 250 ఇండ్ల కు మరుగుదొడ్లు నిర్మించినట్టు గ్రామ కార్యదర్శి వివరించారు.
ప్రాథమిక పాఠశాలను సందర్శించి విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. పాఠశాలలో తాగునీటి నమూనాలను సేకరించి పరీక్షలు నిర్వహించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రజలకు నిరంతరం స్వచ్ఛమైన తాగునీరు అందేలా మిషన్ భగీరథ అధికారులు చర్యలు తీసుకోవాలని, నీటి సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా చూడాలని సూచించారు. కార్యక్రమంలో మిషన్ భగీరథ ఎస్ఈ నాగేశ్వరరావు, చండూరు ఆర్డీవో శ్రీదేవి, గ్రిడ్ ఈఈ లక్ష్మీనారాయణ, డీఈ అజయ్ కుమార్, తహసీల్దార్ ఆంజనేయులు, ఎంపీడీవో రామకృష్ణశర్మ, ప్రయోగశాల ఇన్చార్జి వీరారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

