ప్రేక్షకులంతా చిన్నపిల్లలై ఎంజాయ్ చేస్తారు
‘ఈ సినిమాలో నటించిన పిల్లల్ని చూస్తుంటే ఆశ్చర్యంగా ఉంది. ఆ వయసులో నాకు ఏదీ తెలిసేది కాదు.
‘ఈ సినిమాలో నటించిన పిల్లల్ని చూస్తుంటే ఆశ్చర్యంగా ఉంది. ఆ వయసులో నాకు ఏదీ తెలిసేది కాదు. ఈ జనరేషనే ఫాస్ట్‌గా ఉంది. మరచిపోయిన జ్ఞాపకాలను గుర్తుచేసే సినిమా ఇదని కథ,కథనాల గురించి వింటే తెలిసింది. ఎక్కడా ఇది చిన్నపిల్లల సినిమాగా అనిపించడం లేదు. నిర్మాత ధీరజ్ నమ్మకం నిజం కావాలి. ఆయనకు ఈసినిమా పెద్ద విజయాన్ని ఇవ్వాలి. థియేటర్లలో ఈ సినిమా చూడండి. ప్రేక్షకులంతా చిన్నపిల్లలై ఎంజాయ్ చేస్తారు’ అని హీరో కిరణ్ అబ్బవరం అన్నారు. మాస్టర్ రోహన్, మాస్టర్ అరుణ్, బేబీ ఖుషి ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం ‘సమ్మర్ హాలిడేస్’.
శ్రీకర్ నయన్ దర్శకుడు. ధీరజ్ మొగలినేని నిర్మాత. ఈనెల 6న సినిమా విడుదల కానున్నది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీరిలీజ్ ఈవెంట్‌కి అతిథిగా విచ్చేసిన కిరణ్ అబ్బవరం పై విధంగా మాట్లాడారు. మరో ముఖ్య అతిథి అగ్ర నిర్మాత అల్లు అరవింద్ చిత్రబృందానికి శుభాకాంక్షలు అందించారు. ఇది పిల్లల సినిమా కాదని, ఇద్దరు చిన్న హీరోలు నటించిన సినిమా అనీ, ఇందులో అమ్మమ్మగా నటించానని సహజనటి జయసుధ చెప్పారు. ఈ సినిమా చూసి బయటకు వచ్చాక ప్రతి ఒక్కరూ తమ చిన్ననాటి స్నేహితులకు ఫోన్ చేస్తారని, బాల్యాన్ని గుర్తుచేసే అద్భుతమైన సినిమా ఇదని నిర్మాత ధీరజ్ మొగిలినేని అన్నారు. ఇంకా చిత్రబృందంతో పాటు దర్శకులు బాబీ, రాహుల్ రవీంద్రన్, కౌశిక్, రామ్‌జగదీశ్, నందకిశోర్ కూడా మాట్లాడారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Women’s Asian Champions Trophy | చైనాపై భారత్ ఘన విజయం.. ఆసియా హాకీ ఛాంపియన్‌గా హ్యాట్రిక్
Child Marriage | టెంకంపేట్లో బాల్యవివాహానికి బ్రేక్.. అధికారుల చొరవతో నిలిపివేత
Begumpet Students | సిద్దిపేట వైజ్ఞానిక ప్రదర్శనలో బేగంపేట విద్యార్థుల ప్రతిభ.. రాష్ట్రస్థాయికి స్మార్ట్ వాకర్ ప్రాజెక్టు
Myanmar military bombs school | స్కూల్‌పై మయన్మార్ ఆర్మీ బాంబు దాడి.. మహిళలు, పిల్లలతో సహా 30 మంది మృతి
ఓబీసీ కులగణన తర్వాతే డీలిమిటేషన్ చేపట్టాలి.. బీసీ మహిళలకు సబ్‌కోటా కల్పించాలి.. జాజుల శ్రీనివాస్ డిమాండ్
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

