Kunamaneni | బీజేపీకి సంపూర్ణ మెజార్టీ రాకపోవడంతో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తున్నదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. ఎన్డీయే కూటమి ఎన్నో రోజులు అధికారంలో ఉండదని జోస్యం చెప్పారు.
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో కూనంనేని మీడియాతో మాట్లాడుతూ.. రెండు తెలుగు రాష్ట్రాలకు అన్యాయం చేసిన బీజేపీకి చంద్రబాబు మద్దతు తెలపడం సరైన నిర్ణయం కాదని అభిప్రాయపడ్డారు. మత విద్వేషాలను రెచ్చగొట్టే పార్టీలకు కాకుండా ప్రజాస్వామ్యాన్ని కాపాడే పార్టీలకు మద్దతు ఇస్తే బాగుండేదని అన్నారు. పూర్తి మెజారిటీ లేని బీజేపీ ప్రభుత్వాన్ని నడిపించడం కత్తిమీద సాము లాంటిదని అన్నారు.