ఉస్మానియా యూనివర్సిటీ: రాబోయే వినాయకచవితి పండుగ సందర్భంగా నిర్వహించబోయే ఉత్సవాలలో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా కొవిడ్ నిబంధనలు పాటించాలని ఉస్మానియా యూనివర్సిటీ ఇన్స్పెక్టర్ రమేశ్నాయక్ సూచించారు. గణేశ్ ఉత్సవాల నేపథ్యంలో మండపాల నిర్వాహకులతో ఓయూ పోలీసులు మంగళవారం సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా రమేశ్నాయక్ మాట్లాడుతూ మండపాల వద్ద తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. మాస్కులు ధరించడంతో పాటు శానిటైజర్ వినియోగించేలా చూడాలన్నారు. మాస్కులు లేకుండా ఎవరినీ అనుమతించకూడదని సూచించారు.