‘మిక్సోపతి’కి అనుమతి లేదు : ఐఎంఏ
‘మిక్సోపతి’కి అనుమతి లేదు : ఐఎంఏ | తేలిక పాటి, లక్షణాలు లేని రోగులకు పంపిణీ చేసే కొవిడ్-19 కిట్‌లో పతంజలి తయారు చేసిన కరోనిల్‌ను ఉత్తరాఖండ్ ప్రభుత్వం చేర్చింది.

డెహ్రాడూన్ : తేలిక పాటి, లక్షణాలు లేని రోగులకు పంపిణీ చేసే కొవిడ్-19 కిట్‌లో పతంజలి తయారు చేసిన కరోనిల్‌ను ఉత్తరాఖండ్ ప్రభుత్వం చేర్చింది. ఈ నిర్ణయంపై ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఉత్తరాఖండ్ విభాగం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు ఉత్తరాఖండ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాసింది. అల్లోపతి మందులు ఉండే కరోనా కిట్‌లో ఆయుర్వేదానికి చెందిన ‘కరోనిల్’ను చేర్చడంతో అది ‘మిక్సోపతి’ అవుతుందని ఎద్దేవా చేసింది. కరోనిల్‌కు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆమోదం లభించలేదని ఈ సందర్భంగా గుర్తు చేసింది. కేంద్రం మార్గదర్శకాల్లో సైతం ఆయుర్వేద ఔషధాలను చర్చలేదని చెప్పింది.
గతంలో సుప్రీం కోర్టు పలు సందర్భాల్లో ఇచ్చిన ఆదేశాల్లో అల్లోపతి, ఆయుర్వేదాన్ని కలుపడం ఆమోదయోగ్యం కాదని చెప్పిందని పేర్కొంది. ఈ మేరకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఐఎంఏ కోరింది. ఇదిలా ఉండగా.. ఇంట్లో సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉన్న స్వల్ప, తేలిక పాటి లక్షణాలతో బాధపడుతున్న వ్యక్తులకు ఉత్తరాఖండ్ ఆరోగ్యశాఖ కొవిడ్ కిట్‌ను అందజేస్తోంది. కిట్‌లో థర్మా మీటర్, పారాసెటమాల్ మాత్రలు, విటమిన్ డీ, జింక్, ఐవర్ మెక్టిన్ మాత్రలు ఉన్నాయి. ఇటీవల అల్లోపతి వైద్యంపై బాబా రాందేవ్ విమర్శలు చేసిన విషయం తెలిసిందే. ఇప్పటి నుంచి బాబారాందేవ్, ఐఎంఏ మధ్య మాటల యుద్ధం సాగుతున్నది. ఈ క్రమంలో కరోనిల్‌ను కొవిడ్ కిట్‌లో రోగులకు పంపిణీ చేయడంపై ఐఎంఏ మండిపడుతున్నది.
ఇవి కూడా చదవండి..
పర్యావరణ హితం : చెట్టుపై ఇల్లు కట్టిన ఐఐటీయన్
06.06.2021 ఆదివారం, మీ రాశిఫలాలు
బెంగాల్ బీజేపీ నేత సువేందు అధికారిపై కేసు నమోదు
జమ్మూకాశ్మీర్‌లో స్వల్ప భూకంపం
వాహనదారులకు షాక్.. మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
యెమెన్‌లో రాకెట్ దాడి.. 17 మంది దుర్మరణం
కోల్‌కతాలో బీజేపీ కార్యాలయం వద్ద బాంబుల కలకలం
దేశంలో కొత్తగా 1.14లక్షల కరోనా కేసులు
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | రేవంత్ రెడ్డి పాలమూరు ద్రోహి.. మళ్లీ ఈ జిల్లాలో వలసలు మొదలైనయి : హరీశ్ రావు
Palamuru Lift | ఫలించిన సింగిరెడ్డి వ్యూహం..ఎట్టకేలకు పాలమూరు లిఫ్ట్ ప్రారంభం
Akhilesh Yadav | అఖిలేష్ యాదవ్‌కు షాక్.. బీజేపీలో చేరిన ఎస్పీ రెబల్ ఎమ్మెల్యేలు
Prabhas | ‘కల్కి 2’ సెట్స్‌లోకి రెబల్ స్టార్ ప్రభాస్.. త్వరలో ప్రారంభం కానున్న భారీ షెడ్యూల్!
రైతుల వ్యథలు పట్టించుకోని ప్రభుత్వం : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

