Aamir Khan | బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్, గౌరీ స్ప్రాట్ల అంతర్మత వివాహం తీవ్ర వివాదాలకు దారితీస్తోంది. జూలై 5న స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కింద వీరి వివాహం రిజిస్టర్ పద్ధతిలో జరగ్గా, ప్రస్తుతం ఇరువైపుల మత వర్గాల నుండి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
ఆమిర్ ఖాన్ను చంపిన వారికి రూ.5 కోట్ల రివార్డు ఇస్తామని అయోధ్యకు చెందిన జగద్గురు పరమహంస ఆచార్య ప్రకటించిన సంగతి తెలిసిందే. మహారాష్ట్ర మంత్రి నితేష్ రాణే వ్యాఖ్యలకు మద్దతుగా ఆయన ఈ బెదిరింపులకు పాల్పడ్డారు. అలాగే బజరంగ్ దళ్ కార్యకర్తలు కూడా ఆమిర్ ఖాన్ దిష్టిబొమ్మను దహనం చేస్తూ ఆరోపణలు చేశారు. అయితే ఇది జరిగిన కొద్దిరోజులకే ముస్లిం పర్సనల్ దారుల్ ఇఫ్తా షాహీ చీఫ్ ముఫ్తీ మౌలానా ఇబ్రహీం హుస్సేన్ ఈ పెళ్లికి వ్యతిరేకంగా ఫత్వా జారీ చేశారు. షరియా చట్టం ప్రకారం ముస్లిమేతర మహిళను వివాహం చేసుకోవడం పాపమని, ఆమిర్ ఖాన్ పశ్చాత్తాపపడాలని ఆయన పేర్కొన్నారు. అయితే, వీరిద్దరూ చట్టబద్ధంగా, పరస్పర అంగీకారంతో వివాహం చేసుకున్నారనే విషయాన్ని ఇరువర్గాలు విస్మరిస్తున్నాయని విమర్శలు వస్తున్నాయి. ఈ వివాదాలపై అమీర్ ఖాన్ దంపతులు ఇప్పటివరకు స్పందించలేదు.