Samantha | టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత వ్యక్తిగత జీవితంలో చోటుచేసుకుంటున్న మార్పులు అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఒకప్పుడు తనకు వంట చేయడం పెద్దగా రాదని, కిచెన్‌లో గడపడం కంటే షూటింగ్‌లు, కెరీర్‌పైనే ఎక్కువ దృష్టి పెట్టేదానినని చెప్పిన సమంత.. ఇప్పుడు పూర్తిగా మారినట్టు కనిపిస్తుంది. ప్రస్తుతం ఆమె రాయలసీమ సంప్రదాయ వంటకాలను నేర్చుకోవడంలో ఆసక్తి చూపుతున్నట్లు సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. సమంత సన్నిహితుల సమాచారం ప్రకారం, ప్రస్తుతం ఆమె ఇంట్లోనే ఎక్కువ సమయం గడుపుతూ రాయలసీమ ప్రత్యేక వంటకాలను నేర్చుకుంటున్నారట. ఘాటు రుచులు, ప్రత్యేకమైన మసాలాలు, సంప్రదాయ తయారీ విధానాలతో ప్రసిద్ధి చెందిన సీమ వంటలను ఎంతో ఆసక్తిగా నేర్చుకుంటూ, స్వయంగా తయారు చేసి రుచి చూస్తున్నట్లు తెలుస్తోంది.
ఒకప్పుడు వంటకు దూరంగా ఉండే సమంత.. ఇప్పుడు కిచెన్‌లో సమయం గడపడం అభిమానులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. సమంత జీవితంలో ఇటీవల చోటుచేసుకున్న మార్పులే ఈ కొత్త అభిరుచికి కారణమని పలువురు భావిస్తున్నారు. ప్రస్తుతం ఆమె ప్రశాంతమైన కుటుంబ జీవితాన్ని ఆస్వాదిస్తూ, ఇంటి వాతావరణంలో ఎక్కువ సమయం గడుపుతున్నారు. దీంతో గతంలో చేయలేకపోయిన ఎన్నో విషయాలను ఇప్పుడు ఆసక్తిగా నేర్చుకుంటున్నారని సమాచారం. ప్రస్తుతం ప్రెగ్నెంట్‌గా ఉన్న సమంత బయట కార్యక్రమాలను తగ్గించి విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ విరామ సమయంలో వంటపై దృష్టి పెట్టడం ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఆరోగ్యకరమైన, ఇంట్లో తయారైన ఆహారం ఈ సమయంలో ఎంతో ఉపయోగపడుతుందని భావిస్తూ, పోషకాహారంతో కూడిన సంప్రదాయ వంటకాలను నేర్చుకుంటున్నారని సన్నిహితులు చెబుతున్నారు.
తెలుగు కుటుంబంలో కొత్త జీవితాన్ని ప్రారంభించిన తర్వాత తెలుగు సంస్కృతి, సంప్రదాయాలు, స్థానిక వంటకాలపై సమంతకు మరింత ఆసక్తి పెరిగిందని ఇండస్ట్రీ వర్గాలు పేర్కొంటున్నాయి. ముఖ్యంగా రాయలసీమ వంటకాల ప్రత్యేక రుచిని ఆమె ఎంతో ఇష్టపడుతున్నట్లు సమాచారం. కుటుంబ సభ్యుల కోసం స్వయంగా వంట చేసి వడ్డించడం ద్వారా కొత్త ఆనందాన్ని పొందుతున్నారని తెలుస్తోంది. ఇటీవల విడుదలైన ‘మా ఇంటి బంగారం’ చిత్రంలో ఓ ఇంటి కోడలిగా సమంత ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. సినిమాలో కుటుంబానికి అండగా నిలిచే పాత్రలో కనిపించిన ఆమె.. ఇప్పుడు నిజ జీవితంలో కూడా కుటుంబంతో కలిసి గడుపుతూ, వంటకాలు నేర్చుకోవడం ద్వారా మరో కొత్త కోణాన్ని పరిచయం చేస్తున్నట్లు అభిమానులు భావిస్తున్నారు.