Kalyan Banerjee | టీఎంసీలో అంతర్గత కలహాలు.. ఎంపీ కల్యాణ్ బెనర్జీ సంచలన వ్యాఖ్యలు
Kalyan Banerjee | తృణమూల్ కాంగ్రెస్ (TMC) పార్టీలో అంతర్గత విభేదాలు మరోసారి రోడ్డున పడ్డాయి. కోల్‌కతా (Kolkata) లోని క్యామాక్ స్ట్రీట్ (Camac street) లో ఉన్న పార్టీ కీలక కార్యాలయం వెలుపల టీఎంసీ సీనియర్ ఎంపీ (TMC MP) కల్యాణ్ బెనర్జీ (Kalyan Banerjee) చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో సంచలనం రేపుతున్నాయి.
Kalyan Banerjee : తృణమూల్ కాంగ్రెస్ (TMC) పార్టీలో అంతర్గత విభేదాలు మరోసారి రోడ్డున పడ్డాయి. కోల్‌కతా (Kolkata) లోని క్యామాక్ స్ట్రీట్ (Camac street) లో ఉన్న పార్టీ కీలక కార్యాలయం వెలుపల టీఎంసీ సీనియర్ ఎంపీ (TMC MP) కల్యాణ్ బెనర్జీ (Kalyan Banerjee) చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో సంచలనం రేపుతున్నాయి. పార్టీలోని ప్రస్తుత పరిణామాలు, కొందరు నేతల ఏకపక్ష నిర్ణయాలవల్ల పార్టీ పతనం దిశగా సాగుతోందంటూ ఆయన ఆందోళన వ్యక్తంచేశారు.
క్యామాక్ స్ట్రీట్ వద్ద మీడియా ప్రతినిధులతో మాట్లాడిన కల్యాణ్ బెనర్జీ.. పార్టీ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సంస్థ అయిన ‘ఐ-ప్యాక్‌పైన, పార్టీ యువనేత అభిషేక్ బెనర్జీకి అత్యంత సన్నిహితంగా ఉండే వర్గంపైన పరోక్షంగా నిప్పులు చెరిగారు. పార్టీని నడిపిస్తున్న విధానం సరైనది కాదని, కష్టపడి పనిచేసే సీనియర్లను పక్కనబెట్టి కొందరికి మాత్రమే ప్రాధాన్యం ఇస్తున్నారని మండిపడ్డారు. ఇదే ధోరణి గనుక కొనసాగితే తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అంతర్గతంగా కుప్పకూలిపోయే ప్రమాదం ఉందని బహిరంగంగానే హెచ్చరించారు.
బెంగాల్ రాజకీయాలపై పట్టు సాధించే క్రమంలో మమతాబెనర్జీ వారసుడిగా ఉన్న అభిషేక్ బెనర్జీ వర్గానికి, పార్టీ సీనియర్ నేతలకు మధ్య ఎప్పటి నుంచో విభేదాలు నడుస్తున్నాయి. అయితే ఇప్పుడు కల్యాణ్ బెనర్జీ నేరుగా పార్టీ ఆఫీస్ ముందే ఈ తరహా వ్యాఖ్యలు చేయడం టీఎంసీ శ్రేణుల్లో పెద్ద చర్చకు దారితీసింది. ఈ వ్యవహారంపై పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ ఎలా స్పందిస్తారోనని రాజకీయ వర్గాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

